Viral Video: అయోధ్యను చూడాలని ఉందన్న ఆఫ్రికన్.. రామ్ సియా రామ్ పాటను హమ్ చేసిన కిలి పాల్

|

Jan 18, 2024 | 3:12 PM

కిలీ పాల్ ఆవుల మందలో నిలబడి కనిపించాడు. ఈ సమయంలో అతను 'రామ్ సియా రామ్, సియారామ్ జై జై రామ్' అని పాటను హమ్ చేయడం కూడా వినవచ్చు. త్వరలో రామజన్మభూమిని సందర్శించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వీడియోను షేర్ చేసిన తర్వాత కైలీ క్యాప్షన్‌లో ఇలా రాశాడు, తాను అయోధ్యకు రావడానికి చాలా ఆత్రంగా ఉన్నట్లు.. ఫంక్షన్‌కి హాజరు కావాలనుకుంటున్నాట్లు పేర్కొన్నారు. తనకు రాముడి ఆశీస్సులు  కావాలి అంటూ 'జై శ్రీరామ్' అని కామెంట్ చేశాడు.

Viral Video: అయోధ్యను చూడాలని ఉందన్న ఆఫ్రికన్.. రామ్ సియా రామ్ పాటను హమ్ చేసిన కిలి పాల్
Ayodhya Ram Mandir
Follow us on

టాంజానియాకి చెందిన కిలి పాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. భారతీయ సినిమా పాటల ద్వారా మన దేశంలో కూడా తన సోదరితో కలిసి ఫేమస్ అయిన కిలీ పాల్ ఇప్పుడు అయోధ్యను సందర్శించేందుకు ఉత్సాహంగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. కిలీ పాల్ బాలీవుడ్ పాటలతో సహా అనేక భారతీయ పాటలకు డ్యాన్స్ , లిప్ సింక్ చేయడం ద్వారా నెటిజన్లను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అయోధ్యలో శ్రీ రాముని ప్రతిష్ఠాపన రోజు సమీపిస్తున్న వేళ తనకు అయోధ్యను సందర్శించాలని ఉందనే కోరికను వ్యక్తం చేశాడు. అంతేకాదు కిలి పాల్ ‘రామ్ సియా రామ్’ పాటను పాడుతూ అయోధ్యను సందర్శించడానికి ఆ శుభ సమయం కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు. ఈ నెల 16న షేర్ చేసిన వీడియోలో కిలీ పాల్ ‘రామ్ సియా రామ్’ పాటలో కొంత భాగాన్ని పాడాడు. ఆ వీడియోకు ‘అయోధ్యను సందర్శించేందుకు ఎగ్జైటెడ్’ అని క్యాప్షన్ కూడా పెట్టాడు. దక్షిణాఫ్రికాలోనూ శ్రీ రామ నామ స్మరణ మారు మ్రోగుతోందని తెలుస్తోంది. ఈ నెల  22న రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చారిత్రక ఘట్టాన్ని చూసేందుకు కోట్లాది మంది రామభక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వీడియోలో  కిలీ పాల్ ఆవుల మందలో నిలబడి కనిపించాడు. ఈ సమయంలో అతను ‘రామ్ సియా రామ్, సియారామ్ జై జై రామ్’ అని పాటను హమ్ చేయడం కూడా చూడవచ్చు. త్వరలో రామజన్మభూమిని సందర్శించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వీడియోను షేర్ చేసిన తర్వాత కైలీ క్యాప్షన్‌లో ఇలా రాశాడు, తాను అయోధ్యకు రావడానికి చాలా ఆత్రంగా ఉన్నట్లు.. ఫంక్షన్‌కి హాజరు కావాలనుకుంటున్నాట్లు పేర్కొన్నారు. తనకు రాముడి ఆశీస్సులు  కావాలి అంటూ ‘జై శ్రీరామ్’ అని కామెంట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

వీడియో పై ఓ లుక్ వేయండి..

కిలీకి భారత్ లో మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. ఈ వీడియో ఇప్పటివరకు 70 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకోగా.. చాలా మంది తమ అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. సోదరా, అయోధ్యకు మీకు హృదయపూర్వక స్వాగతం అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు మీరు టాంజానియాలో జన్మించి ఉండవచ్చు, కానీ మీరు మానసికంగా భారతీయుడని మరొకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..