Viral Video: ఫ్లైట్‌లో ప్యాసింజర్‌కు రాఖీ కట్టిన ఎయిర్ హోస్టెస్.. రియాక్షన్స్ మామూలుగా లేవుగా!

రక్షాబంధన్ పండుగను ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఓ విమానంలో జరిగిన రాఖీ వేడుక సోషల్ మీడియాలో ప్రత్యేకంగా నిలిచింది. Air India విమానంలో క్యాబిన్ సిబ్బంది ప్రయాణికుడికి రాఖీ కట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: ఫ్లైట్‌లో ప్యాసింజర్‌కు రాఖీ కట్టిన ఎయిర్ హోస్టెస్.. రియాక్షన్స్ మామూలుగా లేవుగా!
Raksha Bandhan In Air India Flight

Updated on: Aug 28, 2026 | 2:19 PM

రక్షాబంధన్ పండుగను ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఓ విమానంలో జరిగిన రాఖీ వేడుక సోషల్ మీడియాలో ప్రత్యేకంగా నిలిచింది. Air India విమానంలో క్యాబిన్ సిబ్బంది ప్రయాణికుడికి రాఖీ కట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ప్రయాణికుడు సుధాంశు కౌశిక్ ఈ మధురమైన క్షణాన్ని తన కెమెరాలో బంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీడియోను పోస్ట్ చేస్తూ సరదాగా “ఫ్లైట్‌లోని ఎయిర్ హోస్టెస్ నన్ను బ్రో-జోన్‌లో పడేసింది” అంటూ క్యాప్షన్ పెట్టారు.

వైరల్ వీడియోలో ఓ క్యాబిన్ సిబ్బంది సభ్యురాలు ప్రయాణికుడు ముకుంద్ మణికట్టుకు రాఖీ కడుతున్న దృశ్యం కనిపించింది. మరో సిబ్బంది ఈ ప్రత్యేక క్షణాన్ని తన ఫోన్‌లో రికార్డు చేశారు. విమానం ప్రయాణంలోనే జరిగిన ఈ చిన్న వేడుక ప్రయాణికుల్లో ఆనందాన్ని నింపింది.

వీడియో సోషల్ మీడియాలోకి వచ్చిన వెంటనే నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. “రాఖీ కట్టిన తర్వాత భాయ్ సాహెబ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ఆశిస్తున్నా” అంటూ ఓ యూజర్ సరదాగా కామెంట్ చేశారు. మరోవైపు వెనుక సీటులో ఓ ప్రయాణికుడు గాఢంగా నిద్రపోతుండటాన్ని కూడా నెటిజన్లు గమనించారు. “ఇలాంటి పరిస్థితిలో కళ్లుమూసుకుని పడుకోవడమే సేఫ్” అంటూ మరో యూజర్ చమత్కరించాడు.

మొత్తానికి, వేల అడుగుల ఎత్తులో జరిగిన ఈ రాఖీ వేడుక ప్రయాణికులకు మధురమైన అనుభూతిని అందించడంతో పాటు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us