Watch: రాజస్థానీ పాటకు హంస డ్యాన్స్‌.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

సోషల్ మీడియా ప్రపంచంలో మనం ప్రతిరోజూ ఏదో ఒక ప్రత్యేకమైన విషయాన్ని చూస్తుంటాం. కానీ, వెలుగులోకి వచ్చిన ఒక వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోలో ఒక అందమైన హంస రాజస్థానీ జానపద పాటకు అనుగుణంగా డ్యాన్స్‌ చేస్తోంది. ప్రజలు దానిని దీపికా పదుకొనే ప్రసిద్ధ పద్మావత్ చిత్రం ఘూమర్ డ్యాన్స్‌తో పోలుస్తున్నారు.. ఈ వీడియో ఎంతో అద్భుతంగా ఉంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

Watch: రాజస్థానీ పాటకు హంస డ్యాన్స్‌.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Swan's Ghoomar Dance

Updated on: Jun 28, 2025 | 9:15 AM

రాజస్థాన్‌లోని ఒక గ్రామంలోని చెరువు ఒడ్డున తీసిన ఈ అరుదైన వీడియోలో ఒక హంస నీటిలో నిలబడి రెక్కలు ఆడిస్తూ, కాళ్ళు లయబద్ధంగా కదిలిస్తూ కనిపిస్తుంది. రాజస్థానీ జానపద పాట ‘ఘూమర్’ శ్రావ్యమైన ట్యూన్ నేపథ్యంలో వినిపిస్తోంది. ఆ హంస చేస్తున్న కదలికలు ఆ పాట లయకు అనుగుణంగా డ్యాన్స్‌ చేస్తున్నట్లుగా ఉంది. హంస తన రెక్కలను కదిలించి, తల లయబద్ధంగా ఊపుతూ, నీటిలో చిన్న చిన్న అడుగులు వేస్తూ డ్యాన్స్‌ చేస్తుంది. చూసేందుకు అది శిక్షణ పొందిన నర్తకిలా ఘూమర్ మ్యూజిక్‌కి తగినట్టుగా ప్రదర్శన ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్ సరదాగా ఇలా రాశాడు.. “దీపికా పదుకొనే ఘూమర్ బాగుంది, కానీ ఈ హంస అద్భుతాలు చేసింది!” ఈ క్యాప్షన్ వీడియోను మరింత వైరల్ చేసింది.

ఇక వీడియో చూసిన చాలా మంది కూడా ప్రజలు ఈ హంసను పద్మావత్ చిత్రంలోని దీపిక ప్రసిద్ధ ఘూమర్ డ్యాన్స్‌తోనే పోలుస్తున్నారు. దీనిలో దీపిక తన నృత్య నైపుణ్యాలతో అందరి హృదయాలను గెలుచుకుంది. అలాగే, ఈ హంస డ్యాన్స్‌ కూడా సోషల్ మీడియాలో మరో మాయాజాలాన్ని సృష్టించింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

సోషల్ మీడియాలో వినియోగదారులు ఈ వీడియోపై విభిన్నమైన స్పందనలు వ్యక్తం చేశారు. ఒక వినియోగదారుడు స్పందిస్తూ.. ఈ హంస రాజస్థానీ సంస్కృతికి నిజమైన గుర్తింపు అని రాశారు, మరొకరు, దీపిక ఇప్పుడు ఈ హంసను చూసి డ్యాన్స్‌ నేర్చుకోవాలి అంటూ చమత్కరించారు. చాలా మంది ఈ వీడియోను రాజస్థానీ జానపద సంస్కృతి, ప్రకృతి ప్రత్యేకమైన సంగమానికి చిహ్నంగా పేర్కొన్నారు. రాజస్థానీ జానపద పాటల మాధుర్యం, హంస చేసిన అద్భుత విన్యాసాలు ఇంటర్‌నెట్‌ వేదికగా అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..