Viral Video: జస్ట్ మిస్.. ఐదు సెకన్లు ఆగితే ప్రాణాలే పోయేవి.. రైల్వే పోలీసులు లేకుంటే పరిస్థితి ఏమయ్యేదో

|

Jul 18, 2022 | 11:32 AM

రైలు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. సూసైడ్ చేసుకోవడం, ప్రమాదవశాత్తు రైలు కింద పడి మరణించడం వంటి ఘటనలు మనం ఎన్నో చూశాం. కానీ కొన్నిసార్లు మనం చేసే చిన్న పొరపాటు జీవితాలను రోడ్డున...

Viral Video: జస్ట్ మిస్.. ఐదు సెకన్లు ఆగితే ప్రాణాలే పోయేవి.. రైల్వే పోలీసులు లేకుంటే పరిస్థితి ఏమయ్యేదో
Railway Police Viral Video
Follow us on

రైలు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. సూసైడ్ చేసుకోవడం, ప్రమాదవశాత్తు రైలు కింద పడి మరణించడం వంటి ఘటనలు మనం ఎన్నో చూశాం. కానీ కొన్నిసార్లు మనం చేసే చిన్న పొరపాటు జీవితాలను రోడ్డున పడేస్తుంది. అందుకే ప్రయాణికులు పట్టాలపైకి వెళ్లవద్దని రైల్వేశాఖ సూచిస్తోంది. ముఖ్యంగా రైల్వే గేట్‌లు మూసి ఉన్నప్పుడు, స్టేషన్ లో ఒక ప్లాట్ ఫామ్ నుంచి మరో ప్లాట్ ఫామ్ కు వెళ్లేటప్పుడు పట్టాలు దాటడం వంటివి ప్రాణాల మీదకు తీసుకురావచ్చు. ఇలా ప్రమాదాల బారిన పడేటప్పుడు సమీపంలో ఉన్న పోలీసులు, సెక్యూరిటీ చాకచక్యం వల్ల తృటిలో ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైల్వే ప్లాట్‌ఫామ్‌పై చాలా మంది ప్రయాణీకులు నిల్చుని ఉన్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా ట్రాక్‌పై పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీస్.. అతణ్ని రక్షించేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతలో వెనుక నుంచి మరో పోలీస్ అతనికి సహాయం చేయడాన్ని మనం చూడవచ్చు.

అదే సమయంలో ట్రాక్ పై రైలు స్పీడ్ గా వస్తుంది. ఐదు సెకన్లు ఆలస్యం చేసి ఉంటే ఆ వ్యక్తి ప్రాణాలతో ఉండేవాడు కాదన్న విషయం వీడియో చూశాక అర్థమవుతోంది. రైల్వే పోలీసులు అసమాన ధైర్యాన్ని ప్రదర్శించారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన బెంగళూరులోని కేఆర్ పురం రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఈ షాకింగ్ వీడియోను రైల్వే మంత్రిత్వశాఖ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఈ 28 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 88 వేలకు పైగా వీక్షించగా, వేలాది మంది లైక్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి