Viral Video: జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రతి రోజు వైరల్ అవుతుంటాయి. ఇందులో జంతువుల చేష్టలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. అంతేకాదు ఈ వీడియోలను పదే పదే చూస్తూ ఆనందిస్తారు. ఇటీవల ఓ కుక్క, గేదె లాంగ్‌జంప్ పోటీకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో నదిని దాటడానికి కుక్క, గేదె మధ్య పోటీ జరగడం మనం చూడవచ్చు. మొదట గేదెకు ఏమి చేయాలో అర్థం కాలేదు కానీ వేగంగా వచ్చి ఒక్క ఉదుటున నదిపై నుంచి జంప్ చేస్తుంది. కానీ కుక్క నది వరకు వచ్చి భయపడి ఆగిపోతుంది. గేదె చేసిన ఈ జంప్‌ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.
ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారిణి సుధా రామన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 5 సెకన్ల నిడివి గల ఈ వీడియోను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వార్తలు రాసే సమయానికి ఈ వీడియోని 20 వేల మందికి పైగా చూశారు. అంతేకాకుండా నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. కామెంట్ల ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక నెటిజన్ ఇలా రాశాడు ‘శక్తి సామర్థ్యాలు ఉంటే అనుకున్న పని విజయవంతమవుతుందన్నాడు’ మరొక నెటిజన్ ‘అనుకుంటే సాధించలేనిది ఏది లేదన్నాడు’ ఇంకొకరు వీడియోపై స్పందిస్తూ ‘ఈ ఎద్దు అరేబియా గుర్రం లాంటిది సింపుల్‌గా దూకేసింది’ అన్నాడు. మీరు కూడా ఈ వీడియోని చూస్తే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
That one giant leap we all wait for #weekendvibespic.twitter.com/PLEwnXpehA
— Sudha Ramen ?? (@SudhaRamenIFS) February 4, 2022