సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ప్రతీ రోజు చాలా రకాల ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ”ఫైండ్ ది ఆబ్జెక్ట్” వంటి పజిల్స్ నెట్టింట్లో చాలా ప్రాచుర్యం పొందాయి. పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ కూడా వీటిని ఇష్టపడతారు. వాటిల్లో కొన్ని ఆనందాన్ని పంచితే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇలాంటి పజిల్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పైన పేర్కొన్న ఫోటోలో తన ఆహారం కోసం వేటాడేందుకు ఓ చిరుతపులి నక్కి ఉంది. ఇక ఆ ఫోటోలో చిరుత ఎక్కడ ఉందో కనిపెట్టేందుకు చాలామంది ప్రయత్నించారు. కానీ అందరూ ఫెయిల్ అయ్యారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి ఆ ఫోటోపై లుక్కేయండి. చిరుత కనిపించిందా.! ఇంకా గుర్తించలేకపోయారా..! అయితే మీకో చిన్న క్లూ. తన ఎరను వేటాడేందుకు చిరుత పొదలు చాటున నక్కి ఉంది. అక్కడున్న ఏ చెట్టు వెనక ఉందో మీరే కనిపెట్టండి. సోషల్ మీడియాను కన్ఫ్యూజన్‌లో పడేసిన ఈ ఫోటోను వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఏజీ అన్సారీ తీశారు. ఈ చిత్రం జిమ్ కార్బెట్ నేషనల్ పార్కుకు చెందినదని ఆయన పేర్కొన్నాడు.
Also Read:
ఖడ్గమృగంపై దాడికి పులి యత్నం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. బెంగాల్ టైగర్ పరుగో పరుగు.!
అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!
ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..