Viral News: లక్షలు పోసి మేలు జాతి నల్ల గుర్రాన్ని కొన్నాడు.. తీరా ఇంటికొచ్చాక మైండ్ బ్లాంక్..

Black Horse: నీలి రంగులో పడిన నక్క.. తాను దేవతా నక్కనని ..అడవిలో చేసిన సందడి.. వర్షంలో తడిసి రంగు వెలిసి పొతే.. ఆ నక్కకు జరిగిన పరాభవం కథ.. చిన్నతనంలో చదివిన ఈ కథ చాలా మందికి గుర్తు ఉండే..

Viral News: లక్షలు పోసి మేలు జాతి నల్ల గుర్రాన్ని కొన్నాడు..  తీరా ఇంటికొచ్చాక మైండ్ బ్లాంక్..
Black Horse

Edited By: Janardhan Veluru

Updated on: Apr 26, 2022 | 12:02 PM

Black Horse: నీలి రంగులో పడిన నక్క.. తాను దేవతా నక్కనని ..అడవిలో చేసిన సందడి.. వర్షంలో తడిసి రంగు వెలిసి పొతే.. ఆ నక్కకు జరిగిన పరాభవం కథ.. చిన్నతనంలో చదివిన ఈ కథ చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. అయతే ఇపుడు నక్కకు బదులు ఓ గుర్రానికి రంగు వేసి.. మేలు జాతి అంటూ.. లక్షలకు అమ్మేసి.. మోసం చేసాడో ప్రబుద్ధుడు.. ఈ ఘరానా మోసం సోషల్ మీడియా(Social Media) లో నవ్వులు పూజిస్తోంది. గుర్రాలపై తనకున్న మక్కువతో ఓ వ్యక్తి అరుదైన మేలు జాతి గుర్రాన్ని 23లక్షలు వెచ్చించి కొన్నాడు. తర్వాత ఆ గుర్రాన్ని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి చూసి ఖంగుతిన్నాడు.

పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాకు చెందిన రమేశ్ సింగ్ అనే వ్యక్త బట్టల వ్యాపారం చేస్తుంటాడు. ఇతడికి గుర్రాల పెంపకంపై ఆసక్తి ఉండడంతో మేలు జాతి గుర్రాల కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో అతడికి లెహర్ కలాన్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, అతడి స్నేహితులు పరిచయమయ్యారు. తమకు తెలిసిన వారి వద్ద అరుదైన నల్ల మార్వాడీ గుర్రం ఉందని, దానిని 23లక్షలు పెట్టి కొంటే.. 5లక్షల లాభం ఉంటుందని చెప్పారు. వారి మాటలు నమ్మి పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి నల్ల మార్వాడీ గుర్రాన్ని 23లక్షలకు కొన్నాడు. దాన్ని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించాడు. అయితే తీరా స్నానం ముగిశాక.. దాని మీద ఉన్న నలుపు రంగు మొత్తం పోయి లేత గోధుమ రంగు బయటపడింది. దీంతో రమేశ్ సింగ్ కంగుతిన్నాడు.

తనకు మేలు జాతి గుర్రం అని చెప్పి.. సాధారణ గుర్రాన్ని విక్రయించినట్లు గుర్తించాడు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. అరుదైన గుర్రం అని చెప్పడంతో మేలు జాతి గుర్రాల ఉత్పత్తికి సంబంధించిన స్టడ్ ఫాంలపై పెట్టుబడి పెట్టాలని అనుకున్నానని, కానీ ఇలా మోసపోతానని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పలువురిని ఇలాగే నమ్మించి నిందితులు గుర్రాలను విక్రయించినట్లు పోలీసు విచారణలో తెలిసింది. కేసు దర్యాప్తులో ఉంది.

Also Read: Raveena Tandon: పవర్ స్టార్ కోసం రంగంలోకి రవీనా టాండన్.. ఆ సినిమాలో కీలక పాత్రలో ..

దేవుడి ఆశీస్సుల కోసం వెళ్లిన నవ దంపతులు.. ఆలయప్రవేశం నిరాకరణ.. పూజారిని అరెస్ట్ చేసిన పోలీసులు