AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవుడి ఆశీస్సుల కోసం వెళ్లిన నవ దంపతులు.. ఆలయప్రవేశం నిరాకరణ.. పూజారిని అరెస్ట్ చేసిన పోలీసులు

Rajasthan: ఆకాశాన్ని అందుకున్నా.. సముద్రం లోతులు కొలుస్తున్నా.. మానవుడు తన మేథస్సులో సృష్టికి ప్రతి సృష్టి చేసే దిశగా అడుగులు వేస్తున్నా ఇంకా అనేక ప్రాంతాల్లో.. కుల, వర్ణ విచక్షణ కొనసాగుతూనే ఉంది.

దేవుడి ఆశీస్సుల కోసం వెళ్లిన నవ దంపతులు.. ఆలయప్రవేశం నిరాకరణ.. పూజారిని అరెస్ట్ చేసిన పోలీసులు
Rajasthan
Follow us
Surya Kala

|

Updated on: Apr 25, 2022 | 5:38 PM

Rajasthan: ఆకాశాన్ని అందుకున్నా.. సముద్రం లోతులు కొలుస్తున్నా.. మానవుడు తన మేథస్సులో సృష్టికి ప్రతి సృష్టి చేసే దిశగా అడుగులు వేస్తున్నా ఇంకా అనేక ప్రాంతాల్లో.. కుల, వర్ణ విచక్షణ కొనసాగుతూనే ఉంది. ఎంతమంది ఎన్ని సోషల్ అవేర్నెస్ (Social Awareness) కార్యక్రమాలు చేపట్టినా ఇంకా కుల వివక్షత కొనసాగుతూనే ఉంది. తాజాగా దేవాలయంలోకి దళిత దంపతులకు ప్రవేశం నిరాకరించినందుకు పూజారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాజస్థాన్ జలోర్‌లోని దేవాలయంలో ప్రార్థనలు చేసేందుకు దళిత జంటను అనుమతించలేదన్న ఆరోపణలపై పోలీసులు ఆదివారం ఓ పూజారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తమకు “ఏప్రిల్ 22 రాత్రి, ఒక కొత్త దళిత జంట ఆలయంలోకి ప్రవేశించడాన్ని నిలిపివేసినట్లు తమకు సమాచారం అందింది. మేము కేసు నమోదు చేసి ఏప్రిల్ 23 న నిందితుడు పూజారిని అరెస్టు చేసామని చెప్పారు. అంతేకాదు ఈ విషయంపై కేసు విచారణ కొనసాగుతోందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ( డీఎస్పీ) జలోర్ తెలిపారు.

ఏప్రిల్ 22 శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పూజారి దంపతులను ఆలయ ద్వారం వద్ద ఆపివేయడాన్ని చూపిస్తుంది. వారి మధ్య వాదనలు కూడా వీడియోలో కనిపిస్తున్నాయి.  ఈ ఘటనను రాజస్థాన్ జలవనరుల శాఖ మంత్రి మహేశ్ జోషి ఖండించారు. అన్ని మతాలు సమానమేనని అన్నారు. పూజారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు.

(ఇది సిండికేటెడ్ న్యూస్ ఫీడ్ నుండి సవరించబడని.. వార్తా కథనం. టీవీ 9 సిబ్బంది ఈ వార్తను ఎటువంటి సవరణలు చేయలేదు. విశ్లేషణలు చేయలేదు.)

Also Read : Child Care: చిన్నారులకు పొరపాటున కూడా ఈ ఆహారాలు తినిపించకూడదు.. చాలా ప్రమాదం..!