
పిచ్చి పలు రకాలు.. ఇది ఒక రకం అంతే… అందరికీ పిచ్చి ఉంటుంది.. ఇదో పిచ్చి..ఇలాంటి డైలాగ్‌లు తరచూ వింటుంటాం.. అయితే.. పిచ్చి గోల ఏంటి అని అనుకుంటున్నారా..? అయితే.. స్టోరీ చదవాల్సిందే.. ఈ రోజుల్లో చాలా మందికి రీల్స్ పిచ్చి పట్టింది.. సెల్ ఫోన్.. డేటా ఈ రెండూ ఉండనే ఉన్నాయి.. ఇంకేముంది.. రీల్స్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుదామనుకుంటున్నారు. ఈ తరుణంలో తాము ఏం చేస్తున్నామనేది కూడా మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.. ఒక్కోసారి వైరల్ అవ్వాలన్న ధ్యాసలో ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు.. తాజాగా.. ఓ అమ్మాయి.. అబ్బాయి కూడా ఇదే విధంగా భయంకరమైన స్టంట్ చేశారు. దీన్ని చూసి నెటిజన్లు యువ జంటపై ఫైర్ అవుతున్నారు.. ఇలాంటి వీడియోల కోసం ప్రాణాలను పణంగా పెడతారా..? అంటూ నెట్టింట ఫైర్ అవుతున్నారు. ఈ షాకింగ్ వీడియో ఘటన పూణేలోని స్వామి నారాయణ్ టెంపుల్ సమీపంలో చేసినట్లు తెలుస్తోంది..
ప్రస్తుతం.. ఓ జంట రిస్కీ స్టంట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూణేలోని స్వామి నారాయణ్ టెంపుల్ సమీపంలో ఎవరూ లేని భవనం నుంచి దీన్ని చిత్రీకరించారు.. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి టెర్రస్ పై ఈ స్టంట్ చేశారు.. అమ్మాయి చేతిని అబ్బాయి భవనం పై నుంచి పట్టుకోగా.. అమ్మాయి వేలాడుతూ కనిపించింది.. ప్రాణాంతక స్టంట్‌లో చేస్తున్నప్పుడు ఆమె కెమెరాకు పోజులిస్తూ కనిపించింది. ఇది రద్దీగా ఉండే రహదారి పక్కన ఉన్న భవనం రూఫ్ టాప్ నుంచి రికార్డ్ చేయబడింది.
2 words inke liye kuch pic.twitter.com/iEUqbrfKJl
— Prince (@Prince__0033) June 19, 2024
ఈ యువ జంట రీల్ కోసం ఇలా చేసినట్లు పేర్కొంటున్నారు. యువకుడు టెర్రేస్‌పై నుంచి అమ్మాయి చేతిని పట్టుకోగా.. అతని స్నేహితుడు కెమెరాలో ఈ దృశ్యాన్ని బంధించాడు.. ఈ ప్రమాదకర సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఆమె యువకుడి చేయి మాత్రమే పట్టుకుంది. నిర్భయంగా లేదా మూర్ఖంగా స్టంట్ చేస్తున్న సమయంలో అమ్మాయి నవ్వుతూ కనిపించింది.
ఈ జంట షార్ట్ ఫిల్మ్‌ని షూట్ చేస్తున్నారా లేదా సోషల్ మీడియా రీల్ కోసం షూట్ చేస్తున్నారా అనేది స్పష్టంగా తెలియలేదు. అయితే, ఈ ప్రమాదకరమైన సన్నివేశానికి రక్షణ, అవసరమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నట్లు కనిపించలేదు. ఈ రీల్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీనిని “పిచ్చి” అంటారని.. ఇలానేనా చేసిది అంంటూ ఫైర్ అవుతున్నారు. టీనేజ్ లో ఏమి జరుగుతుందో దేవుడికే తెలుసు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
దీనిపై చర్య తీసుకోవాలంటూ నెటిజన్లు ట్యాగ్ చేస్తూ పోలీసులను కోరుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..