Money Earning Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల పేరు ప్రత్యేకంగా ఉంచాలని కోరుకుంటారు. దీని కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఇంటర్నెట్‌లో సరికొత్త పేర్ల కోసం సెర్చింగ్ చేస్తారు. తమ పిల్లలకు ఏం పేరు పెట్టాలనే దానిపై స్నేహితులు, బంధువులను కూడా సంప్రదిస్తారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రత్యేకమైన పేర్ల కోసం తమ పేర్లను ట్యాగ్‌గా పెడతారు. ప్రస్తుతం ఈ ధోరణి అధికంగా ఉంది. అయితే, పిల్లల పేర్ల ట్రెండింగ్‌గా మార్చడం అంత ఈజీ కాదు. అయితే, దీన్ని అదునుగా చేసుకుని కొందరు లక్షల్లో సంపాదిస్తున్నారు. తల్లిదండ్రుల అవసరం వారి పాలిట సంపదగా మారింది. అవును మీరు విన్నది నిజమే. పిల్లలకు ప్రత్యేకమైన, అత్యాధునిక పేర్లను పెట్టడం కోసం చిన్నారుల తల్లిదండ్రుల నుండి భారీ మొత్తంలో ఫీజులు తీసుకుంటారు. వీరినే ప్రొఫెషనల్ బేబీ నేమర్స్ అని కూడా పిలుస్తున్నారు. అయితే, పిల్లలకుపేర్లు పెట్టి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న అలాంటి ఒక ప్రొఫెషనల్ బేబీ నేమర్ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..
అమెరికాలోని న్యూయార్క్‌లో నివసిస్తున్న 33 ఏళ్ల టేలర్ ఎ. హంఫ్రీ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల పేరును నిర్ణయించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ క్షణంలో వారు చాలా గందరగోళానికి గురవుతారు. ఇలాంటి సమయంలో వారికి టేలర్ ఎ హంఫ్రీ అవసరం పడుతుంది. అలా ప్రజల అవసరాన్ని తీర్చి.. ఆమె కోట్లు కూడగడుతుంది.
ఒక్క పేరుకు రూ. 7.6 లక్షలు..
పిల్లల పేర్లు పెట్టేందుకు ఒక్కరికి 10,000 డాలర్లు(రూ.7.6 లక్షలు) ఆ పేరెంట్స్ చెల్లిస్తారని హంఫ్రీ చెప్పుకొచ్చింది. ఈ వ్యాపారాన్ని 2015లో ప్రారంభించానని తెలిపింది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మంచి స్పందన వస్తుండంతో అదే తన వృత్తిగా ఫిక్స్ చేసుకుంది. ‘వాట్స్ ఇన్ ఎ బేబీ నేమ్’ పేరుతో సంస్థను నెలకొల్పింది. తల్లిదండ్రుల సలహాలు, సూచనల ఆధారంగా, పుట్టిన సమయం అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని శిశువు పేరు పెడుతుంది ఈ సంస్థ.
టేలర్‌కు ప్రస్తుతం సొంత పిల్లలు లేరు. కానీ ఆమె వందలాది మంది పిల్లలకు పేర్లు పెట్టింది. టైలర్ సేవలు 1,500 డాలర్లు (రూ. 1.14 లక్షలు) నుండి ప్రారంభమవుతాయి. ఈ రేట్స్ డిమాండ్ ఆధారంగా పెరుగుతాయి. ఆమె ఈ పని ద్వారా కనీసం రూ. 1.14 కోట్లు సంపాదించిందట. అయితే ఆమెకు చాలా మంది కస్టమర్స్ ఉన్నారని, ఆమెకు సేవకు ప్రతిఫలంగా రూ. 7 నుంచి 8 లక్షల వరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చింది.
Also read:
Delhi Files – Vivek Agnihotri: ఇక ‘ఢిల్లీ ఫైల్స్’.. సంచలన ప్రకటన చేసిన వివేక్ అగ్నిహోత్రి..
Russia – Ukraine War: పుతిన్‌కు ఆగ్రహం కలిగించిన ఆ ఘటన.. సైన్యానికి కీలక ఆదేశాలు జారీ..!