నదికి సమీపంలోని ఓ నిర్మానుష్య స్థలంలో పురావస్తు అధికారులు తవ్వకాలు జరిపారు. వారిని ఆశ్చర్యపరుస్తూ పలు అరుదైన అద్భుతాలు బయటపడ్డాయి. ఈ ఘటన జర్మనీలో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. జర్మనీలోని డానుబే నది సమీపంలోని ఓ నిర్మానుష్య స్థలంలో పురావస్తు అధికారులు తవ్వకాలు జరిపారు. వారు రాతియుగానికి చెందిన కుండలు, కత్తులు, ఆభరణాలు వెలికితీయడమే కాకుండా.. మధ్యయుగానికి చెందిన పలు సమాధులను కూడా భూమి నుంచి బయటికి తీశారు. నైరుతి జర్మనీలోని గుట్మాడింగెన్ జిల్లాలో పురావస్తు అధికారులు తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో అధికారులకు 500-600 AD ప్రారంభ మధ్యయుగానికి సంబంధించిన 140 సమాధులు లభ్యమయ్యాయి. వాటిల్లో కత్తులు, శూలాలు, బల్లెలు, షీల్డ్‌లు, ఎముక దువ్వెనలు, గ్లాసులు, చెవిపోగులు దొరికాయి. ఆ జిల్లాలో ఇలాంటివి దొరకడం అరుదు అని అక్కడి మేయర్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ తవ్వకాల్లో లభించిన సమాధులు పాశ్చాత్య రోమన్ సామ్రాజ్యం ముగిసిన శతాబ్దానికి చెందినవిగా పరిశోధకులు పేర్కొన్నారు. ఆ సమయాన్ని వలస కాలం లేదా వోల్కర్‌వాండెరంగ్ అని పిలిచేవారట. అప్పుడు ఐరోపాలోని వివిధ తెగలు తరచూ ఒకరినొకరు జయించుకుంటూ కొత్త భూభాగాల్లోకి పయణిస్తారట. అలాగే కనుగొనబడిన ఈ కాలానికి చెందిన ఇతర సమాధులలో, పురుషులు తరచుగా ఆయుధాలతో.. స్త్రీలు నగలు, పూసలతో ఖననం చేయబడ్డారు. అప్పటి రాజులు ఒక నిర్దిష్ట గ్రామం లేదా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు చనిపోయిన వారిని ఖననం చేసే ఆచారాలు మారుతూ వచ్చాయని పరిశోధకులు చెప్పారు.(Source)
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..