Pomato Viral Video: ఇదేం హైబ్రీడ్‌ పంటరా సామీ..! ఒకే మొక్కకు టమాటాలు, బంగాళదుంప..ఇక దిగుబడి పండగే..!!

|

Feb 14, 2024 | 9:34 AM

ఒక పక్క ప్రజలు రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారని, మరో పక్క ఇలాంటి వింత వింత పనులు జరుగుతున్నాయని ఆవేదనగా రాశారు. పోమాటో మొక్కకు పండిన టమాటా బంగాళాదుంపలా రుచిగా ఉంటుందని ఒకరు రాస్తే.. నేను టమోటాలు ఉపయోగించకుండా, పోమాటాలు ఉపయోగించకుండానే బంగాళాదుంప కూర చేయగలను అని మరొకరు రాశారు.

Pomato Viral Video: ఇదేం హైబ్రీడ్‌ పంటరా సామీ..! ఒకే మొక్కకు టమాటాలు, బంగాళదుంప..ఇక దిగుబడి పండగే..!!
Pomato Tree
Follow us on

Pomato Viral Video: బంగాళాదుంప, టమోటా రెండు వేర్వేరు కూరగాయలు.. రెండూ వేర్వేరు మొక్కల నుండి ఉత్పత్తి అవుతాయి. బంగాళదుంపను హిందీలో ఆలూ అని, టమాటాను హిందీలో టొమాటో అని పిలుస్తారు.. కానీ ఇప్పుడు పొమాటో అని పిలువబడే ఒక సరికొత్త మొక్కను కనిపెట్టారు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక మొక్కకు అడుగున బంగాళాదుంప, మొక్క పైభాగంలో టమాటాలు కాచాయి. ఈ మొక్క పేరు పోమాటో అని వీడియోలో వ్యక్తి చెబుతున్నాడు. ఈ మొక్కతో రైతులకు ఏకకాలంలో రెట్టింపు దిగుబడి వస్తోందని కూడా విరిస్తున్నాడు.

ఇంటర్‌నెట్‌ లో ప్రస్తుతం పోమాటో మొక్క వీడియో అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. వీడియోని ఎక్కువమంది వీక్షించారు. దీంతో రైతుల ఉత్పత్తి పెరిగి ఆదాయం పెరుగుతుందని చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ప్రజలు దీనిపై స్పందిస్తున్నారు. ఇలా ప్రకృతిని పాడు చేయకూడదని కొందరు అంటుండగా మరికొందరు ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరో వినియోగదారుడు వీడియోపై స్పందిస్తూ..ఒక పక్క ప్రజలు రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారని, మరో పక్క ఇలాంటి వింత వింత పనులు జరుగుతున్నాయని ఆవేదనగా రాశారు. పోమాటో మొక్కకు పండిన టమాటా బంగాళాదుంపలా రుచిగా ఉంటుందని ఒకరు రాస్తే.. నేను టమోటాలు ఉపయోగించకుండా, పోమాటాలు ఉపయోగించకుండానే బంగాళాదుంప కూర చేయగలను అని ఒకరు రాశారు.

ఇలా ప్రకృతితో ఆడుకోవద్దని, ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఒకరు రాశారు. ఇది ఫేక్ వీడియో, ఇలాంటి జరగదు, ఇదంతా కేవలం వ్యూస్‌ కోసం ఇలాంటి వీడియోలు తీస్తున్నారని మరొకరు రాశారు. దానికి జోమాటో అని పేరు పెట్టకపోవడం మంచిదని ఒకరు రాశారు.

మొత్తానికి ఈ వీడియో @agrotill అనే ఖాతాతో షేర్ చేయగా, దీన్ని ఇప్పటివరకు 7 మిలియన్ల కంటే ఎక్కువ మంది వీక్షించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..