అమెరికా అధ్యక్షునిగా రెండో పర్యాయం డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన సందర్భంగా చిరుధాన్యాలను ఉపయోగించి సహజసిద్ధంగా ఈ చిత్రాన్ని తయారు చేశారు మోకా విజయ్ కుమార్. విజయ చిహ్నాన్ని చూపుతున్నట్టుగా ట్రంప్ చిత్రం వెనుక భాగంలో అమెరికా జెండాను సైతం తీర్చిదిద్దారు. భారత అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలని మనసారా కోరుకుంటూ ఈ విధంగా అమెరికా అధ్యక్షునికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు విజయకుమార్ చెప్పారు.
ఈ చిత్రపటానికి ఐదు రకాల చిరుధాన్యాలను ఉపయోగించడం విజయకుమార్. అరికెలు, కొర్రలు, సామలు, సజ్జలు, నల్ల సామలు ఉపయోగించి అందంగా తీర్చిదిద్దారు. డోనాల్డ్ ట్రంప్ చిత్రానికి అనుగుణంగా సహజ సిద్ధ రంగులో ఉన్న చిరుధాన్యాలను వినియోగించి అద్భుత కళారూపాన్ని తయారు చేశారు. చిత్రపటాన్ని తయారు చేసేందుకు మూడు రోజులు శ్రమించానని అంటున్నారు విజయ్ కుమార్. ట్రంప్ విజయాన్ని ముందే ఊహించి మిల్లెట్స్ తో చిత్రపటాన్ని తయారు చేయడం ప్రారంభించి.. తన విజయం ఖాయమయ్యే సమయానికి కళా రూపాన్ని తయారు చేయగలిగాను అని అంటున్నారు.
వీడియో చూడండి..
తెలుగింటి అల్లుడు జేమ్స్ డేవిడ్ వ్యాన్స్ ఉపాధ్యక్షుడు కానుండడం తనకు మరింత సంతోషాన్ని ఇచ్చిందని అంటున్నారు. ఈ సందర్భంగా జేమ్స్ డేవిడ్ వ్యాన్స్, అతని భార్య చిలుకూరి ఉషకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..