AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అమ్మాయిల జోలికి వెళ్తే గిట్లుంటది..! రోమియో గ్యాంగ్‌కు రోడ్డుమీదే పోలీసుల ‘స్పెషల్ క్లాస్’!

దేశంలో మహిళల భద్రతపై ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అమ్మాయిలను వేధించారనే ఆరోపణలపై కొందరు యువకులకు పోలీసులు బహిరంగంగా శిక్ష విధించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పోలీసుల చర్యను సమర్థిస్తే, మరికొందరు చట్టపరమైన ప్రక్రియలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Watch Video: అమ్మాయిల జోలికి వెళ్తే గిట్లుంటది..! రోమియో గ్యాంగ్‌కు రోడ్డుమీదే పోలీసుల ‘స్పెషల్ క్లాస్’!
Police Mark Treatment
Balaraju Goud
|

Updated on: Jun 15, 2026 | 4:28 PM

Share

దేశంలో మహిళల భద్రతపై ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అమ్మాయిలను వేధించారనే ఆరోపణలపై కొందరు యువకులకు పోలీసులు బహిరంగంగా శిక్ష విధించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పోలీసుల చర్యను సమర్థిస్తే, మరికొందరు చట్టపరమైన ప్రక్రియలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో నడిరోడ్డులో ముగ్గురు యువకులను కూర్చోబెట్టిన పోలీసులు వారి కాళ్లపై లాఠీలతో కొడుతున్నట్లు కనిపిస్తోంది. వీడియోలో ఒక పోలీసు అధికారి లావుపాటి కర్రతో ఒక్కొక్కరి కాళ్లపై దెబ్బలు కొడుతుండగా, వారు నొప్పితో విలవిలలాడుతూ కనిపించారు. చుట్టుపక్కల ఉన్నవారు ఈ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించడంతో వీడియో మరింత వేగంగా సోషల్ మీడియాలో వ్యాపించింది.

సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాల ప్రకారం, ఈ యువకులు రోడ్లపై వెళ్లే మహిళలు, యువతులను వేధించేవారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఈ విధంగా శిక్షించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులపై అధికారికంగా ఏ కేసులు నమోదయ్యాయనే విషయాలపై స్పష్టత లేదు. అయితే వారి మాటలను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినట్లు తెలుస్తోంది.

ఈ వీడియోను ప్రముఖ సోషల్ మీడియా ఖాతా @gharkekalesh షేర్ చేయడంతో లక్షలాది మంది వీక్షించారు. వీడియోపై స్పందించిన నెటిజన్లు విభిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. “మహిళలను వేధించే వారికి ఇలాంటి శిక్ష అవసరం” అని కొందరు అభిప్రాయపడగా, “చట్టం చేతిలోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదు” అని మరికొందరు వ్యాఖ్యానించారు. “పోలీసులే తీర్పు చెప్పి శిక్షిస్తే, కోర్టుల అవసరం ఏమిటి?” అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాలను స్వతంత్రంగా ధృవీకరించడం సాధ్యం కాలేదు. వీడియోలో కనిపిస్తున్న సంఘటనకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. అందువల్ల సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సమాచారం ఎంతవరకు నిజమనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మహిళల భద్రత అత్యంత ముఖ్యమైనదే అయినప్పటికీ, నేరాలపై చర్యలు చట్టబద్ధమైన ప్రక్రియల ద్వారానే జరగాలని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి…

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us