Viral Video: సినీ ఫక్కీలో కిడ్నాపర్లకు చుక్కలు చూపించిన పోలీస్.. కారుపై దూకి హీరోలా వెంటాడాడు.. వీడియో..

|

Oct 08, 2021 | 11:17 AM

Police Jumps On Kidnappers Car: కొందరు దుండగులు.. ఓ వ్యాపారిని కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో కిడ్నాపర్స్‌ కారును గుర్తించిన పోలీసులు పట్టుకునేందుకు యత్నించారు. కానీ కిడ్నాపర్స్

Viral Video: సినీ ఫక్కీలో కిడ్నాపర్లకు చుక్కలు చూపించిన పోలీస్.. కారుపై దూకి హీరోలా వెంటాడాడు.. వీడియో..
Crime News
Follow us on

Police Jumps On Kidnappers Car: కొందరు దుండగులు.. ఓ వ్యాపారిని కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో కిడ్నాపర్స్‌ కారును గుర్తించిన పోలీసులు పట్టుకునేందుకు యత్నించారు. కానీ కిడ్నాపర్స్ వారి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన ఓ పోలీస్‌.. కారు బానెట్‌ మీదకు దూకి మరీ కిడ్నాపర్స్‌ ముఠాను పట్టుకున్నాడు. సినీఫక్కీలో ఛేజ్ చేసి కిడ్నాపర్స్‌ను పట్టుకోవడంతో ఆ పోలీసును నెటిజన్లు, స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు దుండగులు.. చెన్నై కుండ్రతుర్‌లో ఓ వ్యాపారి కారులో వస్తుండగా కిడ్నాప్ చేశారు. మూడు కోట్ల రూపాయలిస్తేనే వదిలిపెడతామని..లేదంటే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో వ్యాపారి కొడుకు బషీర్ పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారి కొడుకు ఇచ్చిన కంప్లైంట్‌తో కిడ్నాపర్స్‌ను పట్టుకునేందుకు చెన్నై పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా విచారణ చేపట్టారు. అనంతరం సినీ ఫక్కీలో పథకం ప్రకారం రంగంలోకి దిగిన పోలీసులు.. దుండగులకు డబ్బు ఇస్తుండగా కిడ్నాపర్స్‌ను పట్టుకున్నారు. చెన్నైకి చెందిన రౌడీ షీటర్ అరుప్పుకుమార్ గ్యాంగ్ ఈ కిడ్నాప్‌కి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. అరుపుకుమార్‌తో పాటు ముగ్గురుని అరెస్ట్ చేసి మూడు కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

దుండగులను పట్టుకుంటున్న క్రమంలో.. వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక పోలీసు హెడ్ కానిస్టేబుల్ వేగంగా వెళ్తున్న కారు బోనెట్‌పైకి దూకాడు. నగరంలోని చెట్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్.. కారును ఆపేందుకు బానెట్‌పై దూకి ధైర్యం చేశాడని.. అనంతరం కిడ్నాపర్లు దొరికారని పోలీసు అధికారులు తెలిపారు. అలా కారు వేగంగా కొంత దూరం వెళ్లిన తర్వాత కిడ్నాపర్లు ఆపారని తెలిపారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌ను పోలీసులు ప్రశంసించారు.

Also Read:

AP Crime News: కానిస్టేబుల్‌పై యువకుడి వీరంగం.. నేనెవరో తెలుసా అంటూ దాడి

Moto E40: మోటోరోలా నుంచి స్మార్ట్‌ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లోనే.. పూర్తి వివరాలు..!