లోకల్‌ ట్రైన్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ ముందు డ్యాన్స్‌ చేసిన యువతి.. ఆ తర్వాత జరిగిన సీన్‌ చూస్తే..

|

Dec 12, 2023 | 10:53 AM

వైరల్‌ అవుతున్న వీడియోలో కనిపిస్తున్నది ముంబై లోకల్‌ ట్రైన్‌. అయితే, నడుస్తున్న రైల్లో ఒక యువతి రీల్స్‌ చేస్తోంది.. కెమెరా వైపు చూస్తూ డ్యాన్స్ చేస్తోంది..అలా డ్యాన్స్‌ చేస్తూ ఆమె వెనకాలే ఉన్న ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ని ఢీకొట్టింది. యువతి డ్యాన్స్ చేస్తూ తన వెనుక నిలబడి ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌ని ఢీకొట్టి కంగారు పడుతుంది. దాంతో కాసేపు ఆగిపోయింది. ఏమంటారోనని కాస్త కంగారుపడింది.. కానీ,..

లోకల్‌ ట్రైన్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ ముందు డ్యాన్స్‌ చేసిన యువతి.. ఆ తర్వాత జరిగిన సీన్‌ చూస్తే..
Police Constable Dance
Follow us on

ఇది ఇంటర్నెట్ యుగం.. ప్రతి ఒక్కరూ ఇక్కడ తమలోని టాలెంట్‌తో ఫేమస్‌ అవ్వాలని, పైకి రావడానికి ప్రయత్నిస్తారు. అందుకే నేటి తరం యువతి యువకులు ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ హల్‌చల్‌ చేస్తున్నారు. రీల్స్‌, షార్ట్‌ల పేరుతో ఎక్కడపడితే అక్కడ వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కొంత కాలం క్రితం ఢిల్లీ మెట్రోలో అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు చాలానే కనించాయి. ఇది కేవలం మెట్రోకే పరిమితం కాకుండా ఇప్పుడు ముంబై లోకల్‌ ట్రైన్‌లోకి కూడా ఎక్కేసి రీల్ బజార్లు ఓపెన్‌ చేశారు. ముంబయి లోకల్ రైలులో ఓ యువతి డ్యాన్స్ చేస్తున్న మరో వీడియో వైరల్ అవుతోంది. అంతలోనే తన వెనుకే నిలబడి ఉన్న ఓ పోలీసును గమనించింది. ఆ వెంటనే ఆమె తన డ్యాన్స్‌ను కాసేపు ఆపేసింది. ఆ తర్వాత జరిగిన ఘటన ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.

వైరల్‌ అవుతున్న వీడియోలో కనిపిస్తున్నది ముంబై లోకల్‌ ట్రైన్‌. అయితే, నడుస్తున్న రైల్లో ఒక యువతి రీల్స్‌ చేస్తోంది.. కెమెరా వైపు చూస్తూ డ్యాన్స్ చేస్తోంది..అలా డ్యాన్స్‌ చేస్తూ ఆమె వెనకాలే ఉన్న ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ని ఢీకొట్టింది. యువతి డ్యాన్స్ చేస్తూ తన వెనుక నిలబడి ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌ని ఢీకొట్టి కంగారు పడుతుంది. దాంతో కాసేపు ఆగిపోయింది. ఏమంటారోనని కాస్త కంగారుపడింది.. కానీ, మొదట్లో కానిస్టేబుల్ ఆమెను ఏమైన మందలించాడో లేదో తెలియదు గానీ, డ్యాన్స్‌ ఆపేసిన యువతిని చూడాగానే ఆ మరు క్షణంలో అతను కూడా పోలీస్ యూనిఫారంలోనే యువతితో మాస్‌ డ్యాన్స్‌తో రెచ్చిపోయాడు. ఇదంతా చూసి లోకల్‌ ట్రైన్‌లో ఉన్న ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధ్యతగల ఉద్యోగి అయి ఉండి ఇలాంటి పని చేయటం ఏంటని ప్రయాణికులు మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియోని ముంబై స్థానిక వ్యక్తి ఒకరు @Vivekspeaks_ అనే ఖాతా ద్వారా Xలో షేర్‌ చేశారు. ఇక ఇప్పటి వరకు ఈ వీడియోని లక్షలాది మంది చూసి కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. లోకల్‌ ట్రైన్‌లు, మెట్రోలలో రీల్స్‌ చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన ఖాకీలే వారిని ఎంకరేజ్‌ చేస్తుండటం పట్ల నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు కానిస్టేబుల్‌పై కూడా చర్యలు తీసుకోవాలంటూ పలువురు నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..