AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Polar Bear:ఈ ఎలుగుబంటి తెలివికి హ్యాట్సాఫ్‌.. మంచు పలక పగలకుండా ఏం చేసిందో మీరే చూడండి..

ఈ వీడియోలో ఓ తెల్లని ధ్రువపు ఎలుగుబంటి మంచుతో గడ్డకట్టిన ఒక చిన్న నీటి ప్రవాహాన్ని దాటడానికి ఎంతో తెలివిగా వ్యవహరించింది. అది నేరుగా గడ్డకట్టిన నీటిపై నడిస్తే పగిలిపోయి అందులో పడిపోయే ప్రమాదముందని, తెలివిగా దానిపైన పడుకొని జారుకుంటూ వెళ్లిపోయింది.

Polar Bear:ఈ ఎలుగుబంటి తెలివికి హ్యాట్సాఫ్‌.. మంచు పలక పగలకుండా ఏం చేసిందో మీరే చూడండి..
Polar Bear
Basha Shek
|

Updated on: Oct 16, 2022 | 1:39 PM

Share

మనుషులు పాఠశాలకు వెళ్లో, కళాశాలలోనో విద్యనభ్యసించడం ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటారు. కొన్ని విషయాలు తల్లిదండ్రులో, నిపుణులో చెబితే తెలుసుకుంటారు. మరి వన్యమృగాలకు జీవిత పాఠాలను ఎవరు నేర్పిస్తారు. ప్రకృతే వాటికి పాఠశాల. అవి ప్రకృతిలో నిరంతరం జరిగే ప్రక్రియను గమనిస్తూ అనేక పాఠాలు నేర్చుకుంటాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఈ వీడియో ఒక ధ్రువపు ఎలుగుబంటికి సంబంధించినది. ఇవి సాధారణంగా మంచుప్రాంతాల్లో కనిపిస్తాయి. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ తెల్లని ధ్రువపు ఎలుగుబంటి మంచుతో గడ్డకట్టిన ఒక చిన్న నీటి ప్రవాహాన్ని దాటడానికి ఎంతో తెలివిగా వ్యవహరించింది. అది నేరుగా గడ్డకట్టిన నీటిపై నడిస్తే పగిలిపోయి అందులో పడిపోయే ప్రమాదముందని, తెలివిగా దానిపైన పడుకొని జారుకుంటూ వెళ్లిపోయింది. ఈ వీడియోని ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ధ్రువపు ఎలుగుబంటి నేర్పుతున్న జీవితపాఠం అంటూ ఆమె దీనికి క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఈ ఎలుగు తెలివితేటలకు ముచ్చటపడిపోతుంటే.. మరికొందరు ఇదేదో సైంటిస్ట్ ఎలుగుబంటిలా ఉందంటూ జోకులు వేస్తున్నారు.

సాధారణంగా పల్చటి మంచు పొరపై నిలబడితే ఒత్తిడి ఎక్కువై అది పగిలిపోతుంది. ఫలితంగా నీటిలో మునిగిపోవాల్సి వస్తుంది. పైగా ఈ నీళ్లు అత్యంత చల్లగా ఉంటాయి. అందుకే దానిపై పడుకోవాలని సైన్స్ చెబుతుంది. అలా చేస్తే మన శరీరం బరువు ఒకే ప్రాంతంపై పడకుండా.. మంచు పొరపై సమంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తద్వారా మంచుపై తీవ్రత తగ్గి అది పగలదు. మంచుపర్వత ప్రాంతాల్లో ఉండే వ్యక్తులకు ఈ విషయంపై బాగా అవగాహన ఉంటుంది. మరి ఈ ఎలుగుబంటికి ఎవరు ఇది నేర్పించారంటూ తెగ మెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!
ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు
ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు
నేటి రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి శుభవార్తలు, ధనలాభం!
నేటి రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి శుభవార్తలు, ధనలాభం!
పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం.. సూత్రదారులు వారేనా?
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం.. సూత్రదారులు వారేనా?