మోడీ విజయాన్ని పురస్కరించుకుని ముందే సెలబ్రేషన్స్‌కి రెడీ అవుతున్న ఫ్యాన్స్.. బాణసంచా, 10 వేల లడ్డూలు సిద్ధం

|

Jun 04, 2024 | 8:05 AM

ప్రధాని మోడీ విజయం అన్న వార్తలు విన్న అభిమానులు, కార్యకర్తలు వేడుకలను జరుపుకోవడానికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించగా, గుజరాత్‌లో ప్రజల డిమాండ్ మేరకు పలు థియేటర్లలో ఎన్నికల ఫలితాలను ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేశారు. మరోవైపు పటాకులు కాల్చి పండుగ జరుపుకునేందుకు కార్యకర్తలు సిద్ధమయ్యారు. మరోవైపు కాసేపట్లో వెలువడ నున్న ఫలితాలను పురష్కరించుకుని వేడుకల కోసం ముంబైలోని శ్రీ గణేష్ భండార్ స్వీట్ షాప్‌లో 10 వేల లడ్డూలను సిద్ధం చేశారు.

మోడీ విజయాన్ని పురస్కరించుకుని ముందే సెలబ్రేషన్స్‌కి రెడీ అవుతున్న ఫ్యాన్స్.. బాణసంచా, 10 వేల లడ్డూలు సిద్ధం
Massive Celebrations Across India
Follow us on

2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియ  మరికాసేపట్లో  ప్రారంభంకానుంది. దేశ ప్రజల  మొత్తం దృష్టి ఈ ఎన్నికల ఫలితలమీదనే ఉంది. దీంతో పాటు దేశ అధికార పీఠం ఎవరిది అనే ఉత్సుకత కూడా పెరిగింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని సర్వే నివేదికలు చెబుతున్నాయి.  హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తుందని పేర్కొంటున్నాయి. ఈ వార్తలు విన్న మోడీ అభిమానులు, బిజేపీ కార్యకర్తలు ప్రధాని మోడీ గెలుపుని పురష్కరించుకుని తమ సంతోషాన్ని తెలియజేస్తూ భారీ ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ప్రధాని మోడీ విజయం అన్న వార్తలు విన్న అభిమానులు, కార్యకర్తలు వేడుకలను జరుపుకోవడానికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించగా, గుజరాత్‌లో ప్రజల డిమాండ్ మేరకు పలు థియేటర్లలో ఎన్నికల ఫలితాలను ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేశారు. మరోవైపు పటాకులు కాల్చి పండుగ జరుపుకునేందుకు కార్యకర్తలు సిద్ధమయ్యారు. మరోవైపు కాసేపట్లో వెలువడ నున్న ఫలితాలను పురష్కరించుకుని వేడుకల కోసం ముంబైలోని శ్రీ గణేష్ భండార్ స్వీట్ షాప్‌లో 10 వేల లడ్డూలను సిద్ధం చేశారు.

ఇవి కూడా చదవండి

వైరల్ పోస్ట్ ఇక్కడ ఉంది:

ప్రజల డిమాండ్ కారణంగా గుజరాత్‌లోని అనేక థియేటర్లు ఎన్నికల ఫలితాలను పెద్ద స్క్రీన్‌పై ప్రసారం చేయనున్నాయి. X ఖాతా TimesAlebraINDలో షేర్ చేసిన ఈ ప్రత్యేక పోస్ట్‌కు 95 వేలకు వ్యూస్ ను సొంతం చేసుకుంది. భారీ సంఖ్యలో నెటిజన్లు మేము కూడా మోడీ విజయాన్ని జరుపుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..