అండర్‌వాటర్‌లో ’సీల్‘ గారి సిల్లీ వేషాలు

అండర్ వాటర్‌లో సాహసాలకు వెళ్లే స్కూబా డైవర్లకు అప్పుడప్పుడు వింతలు కూడా ఎదురవుతుంటాయి. కొందరని జలచరాలు వెంబడిస్తే.. మరికొన్ని మాత్రం వారితో త్వరగా కలిసిపోతుంటాయి. వీటికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా మనం చూస్తునే ఉంటాం. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి బయటికొచ్చింది. ఇంగ్లండ్‌కు చెందిన మెడికల్ డాక్టర్ బుర్వెల్లి అనే ఓ స్కూబా డైవర్ మరో వ్యక్తితో కలిసి ఇటీవల అండర్‌ వాటర్‌లోకి వెళ్లాడు. అక్కడ వారు సముద్ర అందాలు చూసే సమయంలో […]

అండర్‌వాటర్‌లో ’సీల్‘ గారి సిల్లీ వేషాలు

Edited By:

Updated on: Jul 31, 2019 | 2:03 PM

అండర్ వాటర్‌లో సాహసాలకు వెళ్లే స్కూబా డైవర్లకు అప్పుడప్పుడు వింతలు కూడా ఎదురవుతుంటాయి. కొందరని జలచరాలు వెంబడిస్తే.. మరికొన్ని మాత్రం వారితో త్వరగా కలిసిపోతుంటాయి. వీటికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా మనం చూస్తునే ఉంటాం. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి బయటికొచ్చింది.

ఇంగ్లండ్‌కు చెందిన మెడికల్ డాక్టర్ బుర్వెల్లి అనే ఓ స్కూబా డైవర్ మరో వ్యక్తితో కలిసి ఇటీవల అండర్‌ వాటర్‌లోకి వెళ్లాడు. అక్కడ వారు సముద్ర అందాలు చూసే సమయంలో ఒక సీల్ వారివైపు వచ్చింది. ఆ తరువాత బుర్వెల్లి చెంతకు చేరుకున్న ఆ సీల్.. అతడితో కాసేపు ముచ్చటించింది. బుర్వెల్లికి షేక్ హ్యాండ్ ఇస్తూ.. ఆయన చేతిని తన వద్దకు తీసుకుంటూ ఆడుకుంది. ఈ మొత్తాన్ని బుర్వెల్లితో వెళ్లిన మరో వ్యక్తి తన కెమెరాలో బంధించాడు.

ఆ తరువాత బుర్వెల్లి దాన్ని పోస్ట్ చేస్తూ.. ‘‘సీల్‌వంటి జలచరాలు నీటిలో మానవ సమీపానికి వచ్చినా.. అవి వందశాతం హాని చేయబోవు’’ అని కామెంట్ చేశాడు. కాగా వీటి గురించి మరో ఆసక్తికర విషయాన్ని కూడా అతడు షేర్ చేసుకున్నాడు. సీల్‌లకు మనుషుల చేతులంటే చాలా ఇష్టమని చెప్పిన ఆయన.. డైవర్లు మాత్రం మొదట వాటిని తాకేందుకు ప్రయత్నించకూడదని చెప్పాడు. ఎందుకంటే దానికున్న పదునైన గోళ్లు, పళ్లతో ఆ సీల్ దాడి చేసే అవకాశం ఉందని అన్నాడు. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అందరూ వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.