
అతనో పైలెట్ మంచి జీతం, హోదా.. లగ్జరీ లైఫ్. అయినా కూడా అతని బుద్ధి మాత్రం నీచం. పొట్టి దుస్తులు వేసుకున్న అమ్మాయిలు కనిపిస్తే చాలు అతనిలోని కామాంధుడు బయటికి వచ్చేస్తాడు. అందమైన అమ్మాయిల అభ్యంతరకర వీడియోలు చిత్రీకరిస్తూ రాక్షసానందం పొందుతుంటాడు. ఈ కామాంధుడి చేష్టలపై ఓ అమ్మాయికి అనుమానం వచ్చింది. వెంటనే సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా అతని నీచబుద్ధి, పిచ్చి చేష్టలు బయటపడ్డాయి.
ఆ అమ్మాయి ఫిర్యాదుతో వెంటనే పోలీసులు అమ్మాయిల వీడియోలు తీస్తున్న పైలెట్ మోహిత్ ప్రియదర్శి అరెస్ట్ చేశారు. మోహిత్ మొబైల్‌లో 74 అశ్లీల వీడియోలను గుర్తించారు ఢిల్లీ పోలీసులు. సిగరెట్ లైటర్‌లో స్పై కెమెరాను అమర్చి వీడియోల చిత్రీకరించేవాడు మోహిత్. పొట్టి దుస్తులు ధరించి మాల్స్‌కు వచ్చే యువతులే అతని టార్గెట్. అయితే ఇలా యువతుల వీడియోలు తీస్తూ.. అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న మోహిత్‌పై అనుమానంతో CCTV పరిశీలించిన ఓ యువతి మోహిత్ తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు.
అయితే మొబైల్‌లో చిత్రీకరించిన వీడియోలను ఎక్కడా అప్‌లోడ్ చేయలేదని, తన మొబైల్ ఫోన్లో మాత్రమే ఉంచుకున్నాడని పోలీసుల వెల్లడించాడు నిందితుడు. ఈ వ్యవహారం బయటపడ్డంతో అసలు బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి