Photo Puzzle: మీ కంటి చూపు సామర్థ్యానికి అసలైన పరీక్ష.. ఈ ఫొటోలోని ఇంగ్లిష్‌ పదాన్ని కనిపెడితే మీవి డేగకళ్లే

ఒక ఫొటో ఫజిల్‌ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. మీరు ఈ వైరల్ చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. నలుపు, తెలుపు గీతలు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఈ లైన్ల మధ్య ఒక ఆంగ్ల పదం కూడా దాగుంది.

Photo Puzzle: మీ కంటి చూపు సామర్థ్యానికి అసలైన పరీక్ష.. ఈ ఫొటోలోని  ఇంగ్లిష్‌ పదాన్ని కనిపెడితే మీవి డేగకళ్లే
Optical Illusion
Follow us

|

Updated on: Dec 03, 2022 | 7:40 PM

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చాలా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని చిత్రాలు ఎంతో ఆసక్తిగా ఉంటాయి. వాటిని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అదే సమయంలో ఇంకొన్ని ఫొటోలు ఆశ్చర్యకరంగానూ ఉంటాయి. పైగా కళ్లతో చూసేది ఒకటైతే అందులో ఆంతర్యం మరొకటి ఉంటుంది. వీటిని సాధారణంగా ఆప్టికల్‌ ఇల్యూషన్‌ లేదా ఫొటో పజిల్స్ అంటుంటారు. మెదడుతో పాటు కళ్లకు పని పెట్టే ఈ ఫొటోలకు సామాజిక మాధ్యమాల్లో బాగా క్రేజ్‌ ఉంది. నెటిజన్లు కూడా వీటిని సాల్వ్‌ చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఒక నివేదిక ప్రకారం, ఆప్టికల్ ఇల్యూషన్ మన పరిశీలనా నైపుణ్యం, సామర్థ్యాలను మెరుగుపరుస్తుందట. ఈ నేపథ్యంలో ఒక ఫొటో ఫజిల్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మీరు ఈ వైరల్ చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. నలుపు, తెలుపు గీతలు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఈ లైన్ల మధ్య ఒక ఆంగ్ల పదం కూడా దాగుంది. దీనిని కనుగొనేందుకు ఫొటో డిజైనర్‌ కేవలం 15 సెకన్ల సమయం మాత్రమే ఇచ్చాడు. ఈ నిర్ణీత సమయంలో ఆప్టికల్ ఇల్యూషన్ ను పరిష్కరిస్తే మీకు డేగలాంటి కళ్లున్నట్లే.

సాధారణంగా ఆప్టికల్‌ ఇల్యూషన్స్‌ అంటేనే తికమకకు కేరాఫ్‌ అడ్రస్‌. ఎంతో ఓపికతో చూస్తే కానీ అందులోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేము. ఈ ఫొటో ఫజిల్‌ కూడా అలాంటిదే. చూడ్డానికి నలుపు, తెలుపు గీతలు కనిపిస్తున్నా ఒక ఆంగ్లపదం దాగుంది. కనిపెట్టడం కొంచెం కష్టమైనా తీక్షణంగా చూస్తే ఆ పదాన్ని ఈజీగా కనిపెట్టొచ్చు. మరి ఆలస్యమెందుకు ఓసారి ట్రై చేయండి. 15 సెకన్లలో ఈ ఫొటో పజిల్‌ను సాల్వ్‌ చేయండి. ఎంత వెతికినా దొరక్కపోతే మాత్రం సమాధానం కోసం కింద ఫొటోను చూడండి.

Optical Illusion 1

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..