ప్రపంచంలోనే అతిపెద్ద కోడిపుంజు ఆకారంలో ఉన్న ఎత్తైన భవనాన్ని మీరు ఎక్కడైనా చూశారా..? లేదుకాదా.. అయితే, దీని కోసం మీరు ఫిలిప్పీన్స్‌కు వెళ్లవలసి ఉంటుంది. ఆర్కిటెక్చర్, వాస్తుశిల్పులపై ఆసక్తి ఉన్నవారికి ఈ భవనం ఎంతగానో నచ్చుతుంది. క్యాంపుస్టోహాన్, నీగ్రోస్ ఆక్సిడెంటల్‌లో ఉన్న ఈ భారీ నిర్మాణం క్యాంపుస్టోహాన్ హైలాండ్ రిసార్ట్‌లో భాగంగా నిర్మించారు.
ఈ భవనం పొడవు సుమారు 115 అడుగులు (34.931 మీటర్లు), వెడల్పు సుమారు 40 అడుగులు (12.127 మీటర్లు). 92 అడుగుల పొడవుతో ఆకట్టుకునేలా కట్టడం అంటే చిన్న విషయం కాదు. కోడి ఆకారంలో ఉన్న ఈ భవనంలో 15 గదులు ఉన్నాయి. ఇందులో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ భవనాన్ని నిర్మించాలనే ఆలోచన రికార్డో కానో గ్వాపో టాన్ ఆలోచన. అతని భార్య మొదట రిసార్ట్ భూమిని కొనుగోలు చేసింది. దీనిపై భారీ కోళ్ల భవనాన్ని నిర్మించే పనులు ప్రారంభించారు. ఆరు నెలల ప్రణాళికతో ఈ భవనాన్ని పూర్తి చేసినట్టుగా వివరించారు. జూన్ 10, 2023న నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇది 8 సెప్టెంబర్ 2024న పూర్తయింది. ఈ నిర్మాణం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (GWR) సంపాదించింది.
ఈ హోటల్‌ను నిర్మించే బృందానికి అత్యంత సవాల్‌తో కూడిన విషయం ఏంటంటే.. తుఫానుల ధాటికి తట్టుకుని నిలబడేలా ఈ భవనాన్ని ఎలా పటిష్టంగా చేయాలనేది. ఎంతో నైపుణ్యంతో అన్ని పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యంతో ఈ భవనాన్ని నిర్మించారు. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ భవనాన్ని స్ఫూర్తిగా ఎంచుకుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..