వార్నీ.. వీడి ఇష్టం తగలేయా..! పెంపుడు పాముకు ప్రేమగా తినిపించాడు.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..

ఊహించుకోండి... మీరు మీ పెంపుడు జంతువుకు ప్రేమగా తినిపించిన చేయి, కొన్ని గంటల తర్వాత అతనికి ఆ చేయి లేకుండా పోయింది. ! ఈ షాకింగ్‌ చైనాలో జరిగింది. ఒక వ్యక్తికి పాముల పట్ల ఉన్న మక్కువతో అతడు పామును పెంచుకోవటం మొదలుపెట్టాడు. పాలుపోసినా కూడా పాము విషమే చిమ్ముతుంది అన్నట్టుగా,ఆ విషపూరిత పాము అకస్మాత్తుగా అతనిపై దాడి చేసింది. దీంతో అతడి జీవితం భయంకరమైన మలుపు తిరిగింది. పరిస్థితి చాలా తీవ్రంగా మారింది. చివరకు ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి స్టోరీలోకి వెళ్లాల్సిందే...

వార్నీ.. వీడి ఇష్టం తగలేయా..! పెంపుడు పాముకు ప్రేమగా తినిపించాడు.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..
Snake Bite

Updated on: Jan 05, 2026 | 1:52 PM

చైనాలోని బీజింగ్‌లో హువాంగ్ అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి పాములంటే చాలా ఇష్టం. ఈ ఇష్టంతోనే అతను అత్యంత విషపూరితమైన పొడవైన ముక్కు గల పామును పెంపుడు జంతువుగా పెంచుకోవటం మొదలుపెట్టాడు. ఈ పామును ఐదు-దశల పాము అని పిలుస్తారు. ఎందుకంటే ఈ పాము కాటుకు గురైన వ్యక్తి ఆ తర్వాత ఐదు అడుగులు కూడా నడవలేడని చెబుతారు. అంతటి భయంకర విషం కలిగిన పామును అతడు ఇంట్లో పెంచుతున్నాడు. ఈ క్రమంలోనే హువాంగ్ పెంచుతున్న పాము అనారోగ్యానికి గురైంది. ఆహారం కూడా తీసుకోలేకపోయింది. దాంతో చలించిపోయిన హువాంగ్ ఆప్యాయంగా దానికి తన చేతులతో ఆహారం తినిపించాడు. దీంతో ఆ పాము అతని వేలిని కరిచింది. విషం అతని శరీరమంతా వేగంగా వ్యాపించింది. అతని పరిస్థితి పూర్తిగా విషమంగా మారింది.

ఈ ఘటన పెంపుడు పాము అయినా సరే…దానికి చేతితో ఆహారం తినిపించడం ఎంత ప్రమాదకరమో నిరూపించింది. దాని ప్రాణాలను కాపాడటానికి అతను తన ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. పాము విషం అతని శరీరంలో రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. నెక్రోసిస్ లేదా కణజాల నష్టం అతని బొటనవేలులో ప్రారంభమైంది. అతని ప్రాణాలు కాపాడేందుకు వైద్యులకు ఒకే ఒక మార్గం కనిపించింది. ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉంచేందుకు అతని బొటనవేలును తీసేయడం. ఇది కూడా కష్టమే.. కానీ, అతని ప్రాణాలను కాపాడటానికి ఇది తప్పనిసరిగా మారింది.

ఇవి కూడా చదవండి

ఇటీవలి సంవత్సరాలలో అసాధారణమైన, అన్యదేశ పెంపుడు జంతువులను ఉంచుకునే ధోరణి చైనాలో వేగంగా పెరిగింది. ఇటువంటి జంతువులు ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులను మోసుకెళ్లగలవని చెప్పారు. ఈ అభిరుచి ఎప్పుడు మరణానికి దారితీస్తుందో ఊహించడం అసాధ్యం అంటున్నారు నిపుణులు. ఈ సంఘటన కేవలం ప్రమాదం కాదు. ప్రమాదకరమైన జంతువులను పెంపుడు జంతువులుగా ఉంచుకోవడం ప్రాణాంతకం కాగలదని హెచ్చరిస్తున్నారు. ఇష్టాలు, మంచివే. కానీ, జీవితం విషయానికి వస్తే వివేకం చాలా అవసరం. లేకపోతే, ఒక క్షణం ప్రేమ జీవితాంతం విచారంగా మారవచ్చునని సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..