సైబీరియాలో ఓ నల్ల పిల్లి ధైర్యం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. దాని సాహసాన్ని మెచ్చుకొని వాళ్ళు లేరు.. తనతో ఏ మాత్రం సరితూగని, కావాలంటే ఒక్క క్షణంలో దాడి చేసి..చీల్చి చెండాడే భారీ ఎలుగుబంటిని అది ఎలా ఎదిరించిందో చూడాల్సిందే. ఇటీవల ఓ మహిళ రష్యాలోని సైబీరియాలో తన పెంపుడు పిల్లిని కూడా వెంటబెట్టుకుని ఫిషింగ్ ట్రిప్ కి వెళ్ళింది. అక్కడ నాదీ తీరంతో బాటు కొండలూ..కోనలు కూడా ఉన్నాయి మరి. ఆమె తన ఫ్రెండ్స్ తో కలిసి డ్రింక్ తాగుతూ తన పిల్లి (దానిపేరు వాస్యా అట) ని దాని మానాన దాన్ని వదిలేసింది. అది కూడా వారి నుంచి తప్పించుకుని కొద్దీ దూరం వెళ్ళగానే భారీ ఎలుగు కనిపించింది. అసలు దాన్ని చూడగానే అది భయంతో పరుగెత్తి వెనక్కి రావడానికి బదులు ఆ ఎలుగునే ఎదిరిస్తున్నట్టుగా ఒక్క అడుగైనా వెనక్కి వేయకుండా నిలబడిపోయింది. ఎలుగు తన ముందు కాళ్ళు పైకెత్తి దాన్ని అదిలించబోయినా పిల్లి మాత్రం కదిలితే ఒట్టు.. ఇదంతా దూరం నుంచి చూస్తున్న దాని యజమానురాలు, ఆమె ఫ్రెండ్స్ భయంతో కేకలు పెట్టారు. తన పెంపుడు మార్జాలాన్ని వెనక్కి వచ్చేయాలంటూ ఆ యజమానురాలు కేకలు పెట్టినా అది కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు.
చివరకు దాని ధైర్యం చూసి ఎలుగు భయపడిపోయినట్టుంది. చటుక్కున అక్కడి నుంచి పారిపోయింది. ఈ పిల్లి..ఎలుగుల ‘ప్రతిఘటన’ వీడియోకెక్కింది. సైబీరియాలో జరిగిన ఈ వింత తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: అనిల్ దేశ్ ముఖ్ కేసు.. మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్న సీబీఐ…
Ramayapatnam port: 36 నెలల్లో రామాయపట్నం ఓడరేవు.. ఏపీ, తెలంగాణ వాణిజ్యానికి కీలకంగా మారనున్న పోర్టు