ప్రజలు తమకు ఇష్టమైన వంటకాలను తినడానికి, ఆనందించడానికి రెస్టారెంట్లకు వస్తారు. కానీ, ఓ రెస్టారెంట్‌కు వెళ్లే ప్రజలు మాత్రం తిండి కోసం వెళ్లరు.. అక్కడకు ఎందుకు వెళ్తరో తెలిస్తే మీరు కంగుతింటారు.. ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ రెస్టారెంట్ గురించిన చర్చే జరుగుతుంది. ఎందుకంటే..ప్రజలు ఈ రెస్టారెంట్‌కి వెళ్లేది తిండి తినడానికి లేదంటే.. వారికి ఇష్టమైన వంటకం కోసం కాదు.. చెంపదెబ్బలు తినడానికి. వినడానికి విడ్డూరంగా అనిపించినా ఇది మాత్రం నిజమేనండోయ్.. ఈ రెస్టారెంట్‌కు వెళ్లే ప్రజలంతా నిజంగానే చెప్పదెబ్బలు తినడానికి వెళ్తుంటారట. అంతేకాదు.. ఒక్క దెబ్బకు రూ. 172రూపాయలు కూడా చెల్లిస్తారట..! వార్నీ ఇదెక్కడి విచిత్రం..?డబ్బులిచ్చి చెంపలు పగులగొట్టించుకునే రెస్టారెంట్ ఎక్కడుంది..? ఎందుకు కస్టమర్లు డబ్బు చెల్లించి మరీ చెంపదెబ్బలు తింటున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
జపాన్‌లోని నగోయాలో ఉన్న ఈ రెస్టారెంట్ పేరు షాచిహోకోయా-యా. ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే.. ఇక్కడికి వచ్చే కస్టమర్లు డబ్బులు చెల్లించి మరీ చెంపదెబ్బలు తింటారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో రెస్టారెంట్ కు వచ్చిన కస్టమర్లను మహిళలు చెంపల మీద కొట్టడం స్పష్టంగా కనిపిస్తుంది.. ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
This is Shachihokoya – a restaurant in Nagoya – where you can buy a menu item called ‘Nagoya Lady’s Slap’ for 300 yen pic.twitter.com/19qPM1Ohac
— Bangkok Lad (@bangkoklad) November 29, 2023
ప్రజలు చెంపదెబ్బ తినడానికి 300 జపనీస్ యెన్ (రూ. 172) చెల్లిస్తారు. కిమోనో ధరించిన వెయిట్రెస్‌లు ఆసక్తిగల కస్టమర్‌ల ముఖాలపై తమ అరచేతులతో కొట్టారు. కస్టమర్ కోరుకున్న సిబ్బందిచే చెంపదెబ్బ తినాలనుకుంటే.. 500 యెన్ (287.15 Indian Rupee) సర్‌ఛార్జ్ చేస్తారు.
రెస్టారెంట్ తన వ్యాపారాన్ని 2012 సంవత్సరంలో ప్రారంభించింది. అంతకుముందు, ఒక సాధారణ మహిళా సిబ్బంది చెంపదెబ్బ కొట్టడం ప్రారంభించారు. అయితే ఆ తరువాత డిమాండ్ పెరగడంతో చాలా మంది సిబ్బందిని చెంపదెబ్బ కొట్టడానికి నియమించారు. దీనికి సంబంధించి చాలాసార్లు వివాదం జరిగింది. అయితే ఇప్పుడు రెస్టారెంట్ తన ఫేస్-స్మాకింగ్ సేవను నిలిపివేసినట్లు రెస్టారెంట్ స్పష్టం చేసింది. చెంపదెబ్బలు తినడానికి ఇక్కడకు ఎవరూ రావద్దని కోరారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..