Viral Video: రోడ్డుమీద బైక్ వేగంగా నడుపుతూ యువతి ప్రమాదక విన్యాసాలు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్

|

Jul 16, 2023 | 8:22 PM

బైక్ మీద స్టంట్స్ చేయడానికి యువకులకు ఏ మాత్రం మేము తీసిపోమని కొందరు యువతులు అంటున్నారు. బైక్ నడుపుతూ రకరకాల విన్యాసాలను చేసి ఆ వీడియోలను నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ యువతి బైక్ మీద చేసిన స్టంట్ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన కొందరు ఆశ్చర్య పొతే..

Viral Video: రోడ్డుమీద బైక్ వేగంగా నడుపుతూ యువతి ప్రమాదక విన్యాసాలు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్
Viral Video
Follow us on

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికో లేదా.. తాము చేసే పనులతో లైక్స్ ను సంపాదించుకోవడానికో రకరకాల విన్యాసాలను చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వాహనాలతో చేసే విన్యాసాలకు లెక్కే ఉండడం లేదు. బైక్ మీద చేసే స్టంట్స్ కు లెక్కే ఉండడం లేదు. కొన్ని సార్లు వీరు చేసే విన్యాసాలు ప్రాణాలకు ప్రమాదకరం అని తెలిసినా ఎక్కడా తగ్గడం లేదు. ఇలా బైక్ మీద స్టంట్స్ చేయడానికి యువకులకు ఏ మాత్రం మేము తీసిపోమని కొందరు యువతులు అంటున్నారు. బైక్ నడుపుతూ రకరకాల విన్యాసాలను చేసి ఆ వీడియోలను నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ యువతి బైక్ మీద చేసిన స్టంట్ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన కొందరు ఆశ్చర్య పొతే.. ఇలాంటి విన్యాసాలు ఆ యువతికి మాత్రమే కాదు.. ఇతరులకు కూడా ప్రమాదం కనుక తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

బీహార్ రాజధాని పాట్నాకి చెందిన హంటర్ క్వీన్ అనే యువతి వీడియో వైరల్ అవుతోంది. ఇందులో మహిళా  బైకర్  మెరైన్ డ్రైవ్ స్టంట్ చేస్తూ కనిపించింది. వీడియోలో ఆమె హైవేపై అత్యంత వేగంతో బైక్ నడుపుతోంది. ఈ సమయంలో ఆమె బైక్ హ్యాండిల్ నుండి రెండు చేతులను తీసివేసింది. అయినప్పటికీ బైక్ వేగం తగ్గదు. అదే వేగంగా నడుపుతున్న బైక్‌పై నిలబడి స్టైల్ కొట్టడం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ సమయంలో ఆమె చేతిలో పిస్టల్ కూడా కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే కొందరు ఆ యువతిపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..