
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చాలా వరకు షాకింగ్‌గా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో రద్దీగా ఉండే మెట్రోలో ఒక వ్యక్తి రెండు పాములతో ప్రయాణిస్తున్నాడు. ప్యాసింజర్ మెట్రోలో ఓ వ్యక్తి రెండు పాములతో కనిపించాడు. అదేదో మామూలు పాములు అనుకుంటే పొరపడినట్టే..ఎందుకంటే.. అది పాము కాదు ఒకటి బర్మీస్ కొండచిలువ, మరొకటి బాల్ కొండచిలువ. వినడానికి ఆశ్చర్యంగా ఉందా కదా..? కానీ, ఇది కథ కాదు, నిజంగానే జరిగింది. ఇలాంటి విచిత్రమైన, భయంకరమైన పరిస్థితుల్లో ఏం చేయాలో ప్రయాణికులకు అర్థం కాలేదు. అయితే అతను రెండు భారీ పాములతో రైలు ఎక్కిన తరువాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..
వైరల్ వీడియో న్యూయార్క్ నగరానికి చెందినదిగా తెలిసింది. ఓ వ్యక్తి రెండు పెద్ద పాములతో మెట్రో ఎక్కాడు. ఆ తర్వాత అతనికి ఏమైంది అనేది ఊహకు అందనిది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఆ వ్యక్తి మెడ, చేతులకు రెండు పాములు చుట్టుకుని ఉన్నాయి. అతని చేతికి చుట్టుకుని కనిపిస్తున్న పాము పెద్ద బర్మీస్ కొండచిలువగా, మరొకటి బాల్ కొండచిలువగా తెలిసింది. కానీ అతని కళ్ళలో మాత్రం ఎక్కడా జాడ లేదు. బదులుగా అతను ప్రశాంతమైన మానసిక స్థితిలో ఉన్నాడు.
కానీ, అతని చుట్టూ ఉన్న ప్రయాణీకులు ఆ రెండు పాములను చూసి చాలా భయపడిపోయారు. కానీ, వారి ముఖాల్లో ఆ భావాన్ని వ్యక్తం చేయడానికి నిరాకరించారు. కానీ, వారు ఆ వ్యక్తి నుండి దూరంగా కూడా లేచి వెళ్లలేదు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. లోలోపల భయంతో వారంతా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వారి భయం, బాధ మాటల్లో వర్ణించలేనిది.. ఖచ్చితంగా వీడియో చూడాల్సిందే. @subwaycreaturesofficial అనే ఖాతా ద్వారా వీడియో అప్‌లోడ్ చేయబడింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..