Viral Video: రామ చిలుకలు రెండు గ్రూపులుగా విడిపోయి.. బాస్కెట్ బాల్ ఆడితే ఎట్లుంటుందో తెలుసా..

Viral Video: సోషల్ మీడియా(Social Media) అందుబాటులోకి వచ్చిన తర్వాత నెట్టింట్లో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియాలు(Funny videos) రోజు చక్కర్లు కొడుతున్నాయి..

Viral Video: రామ చిలుకలు రెండు గ్రూపులుగా విడిపోయి.. బాస్కెట్ బాల్ ఆడితే ఎట్లుంటుందో తెలుసా..
Parrots Playing Basket Ball

Updated on: Mar 14, 2022 | 9:36 PM

Viral Video: సోషల్ మీడియా(Social Media) అందుబాటులోకి వచ్చిన తర్వాత నెట్టింట్లో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి.  ముఖ్యంగా జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియాలు(Funny videos) రోజు చక్కర్లు కొడుతున్నాయి. కుక్కలు, పిల్లులు, ఏనుగుల వంటి జంతువుల వీడియోలు మాత్రమే కాదు.. రామ చిలుకలు, నెమళ్ళు వంటి పక్షుల వీడియోలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రంగుల రంగుల రామచిలుకలు తన ముద్దు ముద్దు మాటలతో.. ఆటల వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

ప్రముఖ క్రీడ.. బాస్కెట్బాల్ రెండు గ్రూప్ లు బాల్ ను రింగ్ లో వేస్తూ.. పోటాపోటీగా ఆడే ఆట. అయితే ఈ ఆటను.. రామ చిలుకలు   రెండు గ్రూపులుగా విడిపోయి పోటాపోటీగా ఆడుతుంటే.. ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి.. అందులోనూ పసుపు రంగు రామ చిలుకలు ఒక గ్రూప్ గా.. ఆకు పచ్చ రంగులో ఉన్న రామచిలుకలు ఒక గ్రూప్ గా ఏర్పడ్డాయి. కోర్టులో ఇరువైపులా బాస్కెట్ రింగ్స్ ను లో .. పోటీపోటీగా గోల్స్ చేస్తూ.. సందడి చేస్తున్నాయి. అందులోనూ.. పసుపు రంగు రామ చిలుకలు.. కోర్టుకు ఒకవైపు గోల్స్ చేస్తే.. ఆకు పచ్చ రంగు రామ చిలుకలు మరొక వైపు గోల్స్ చేయడం.. విచిత్రంగా అనిపిస్తుంది చూపరులకు.. ఎందుకంటే వారికి ఎటువంటి గోల్స్ చేస్తే.. తమ ఖాతాలో పడతాయో తెలుసు అన్నట్లు ఆటను ఓ రేంజ్ లో ఆడాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లక్షలాది వ్యూస్ ను.. వేలాది లైక్స్ ను సొంతం చేసుకుంది.

రామచిలుక ఆకర్షణీయంగా వుండే పక్షి. దీనిని పెంపుడు జంతువుగా కొంతమంది పెంచుతారు. సుమారు 350 జాతుల చిలుకలు 85 ప్రజాతులులో ఉన్నాయి. భారతదేశంలో ఈ రామచిలుకను పెంపుడు పక్షిగానే కాక, భగవదంశగా కొలుస్తారు. రాముని ప్రతిరూపంగా ఎక్కువగా కొలవడం చూడవచ్చు. జ్యోతిష్యంలో చిలుక ప్రధాన పాత్ర పోషిస్తుంది.

 

Also Read: Fanny vedio: ఏందిరా.. ఏందిది.. ఇది ఏ భాష పాటో కనిపెడితే మీకన్నా గ్రేట్ ఎవ్వరూ ఉండరు..

Andhra Pradesh: చేతబడి నెపం ఓ నిండు ప్రాణాన్ని చిదిమేసింది.. వీళ్ళు మారరుగాక మారరు..