Viral Video: మనం సోషల్ మీడియాలో అనేక వీడియోలు చూస్తుంటాం. అందులో పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. వాటి మనుగడను దగ్గరనుంచి చూసిన అనుభూతి కలుగుతుంది. వాటి ప్రవర్తన కొంత సరదాగా, మరికొంత ఆలోచింపచేసేవిగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మనం అప్పుడే పుట్టిన నవజాత శిశువుల్ని చూడగానే చిన్నితల్లి లేదా చిట్టి తండ్రి అంటూనో మరేదైనా ముద్దు పేరుతోనో పిలుస్తూ ఆనందిస్తాం కదా. అలాగే టర్కీలోని బుర్సాలో ఓ చిలుక అప్పుడే పుట్టిన తన పిల్లలను చూసి తెగ మురిసిపోయింది. అచ్చం మనిషిలాగే ముద్దు ముద్దుగా పలకరిస్తోంది. రామచిలుక జాతికి చెందిన కాకాటిల్స్ అనే ఈ పక్షి.. మనుషులను చక్కగా అనుకరించడమే కాదు, మనం ఏదైన శిక్షణ ఇస్తే చాలా ఈజీగా నేర్చేసుకుంటుందట. దీనిని అత్యంత తెలివైన పక్షిగా చెబుతున్నారు. అయితే ఆ చిలుకకు ఇష్టమైన ఆట పికాబు అట. దాంతో ఆ పేరుతోనే తన పిల్లలను చక్కగా పలకరిస్తోంది. పైగా వాటిని పింగాణి పాత్రలో భద్రపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోను నెస్టేక్ కనట్లర్ అనే జంతు ప్రేమికుడు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింగ తెగ వైరల్ అవుతోంది. ఎంత చక్కగా తన పిలల్ని పలకరిస్తోందో మీరు కూడా ఓ లుక్ వేయండి.
Also read:
Online Rummy Game: విషాదం.. ఆన్‌లైన్ రమ్మీకి నిండు ప్రాణం బలి.. అప్పులు భరించలేక ఆత్మహత్య