
సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం ఎలాంటి పనులై చేస్తున్నారు. అవన్నీ వీడియో తీసుకుని షేర్ చేస్తూ నెటిజన్ల నుంచి లైకులు, కామెంట్లు సంపాదించుకుంటున్నారు. అంతేకాదు.. ఇప్పుడు చాలా మంది ఇలాంటి వైరల్ వీడియోలు షేర్ చేస్తూ లక్షలు, కోట్లు కూడా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పసిపిల్లాడి తల మెట్ల రెయిలింగ్‌లో ఇరుక్కుపోయింది. దాంతో ఆ బాలుడి తల్లిదండ్రులు భయపడిపోయారు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూస్తే.. మీరు కూడా షాక్ అవుతారు.. ఫేమస్ కావాలనే ఆరాటంతో ప్రజలు ఏదైనా చేస్తారని విషయాన్ని మీరూ ఖచ్చితంగా ఒప్పుకుంటారు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియో ఓ ఇంటి నుంచి వచ్చింది. ఈ వీడియోలో ఒక పిల్లాడి తల మెట్ల రెయిలింగ్‌లో ఇరుక్కుపోయింది. దాంతో వాడు తన తలను రెయిలింగ్ నుండి బయటకు తీయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కానీ బయటకు రాలేకపోతున్నాడు.. అంతలోనే బాలుడి తల్లిదండ్రులు వచ్చి అతని తల బయటకు తీయడానికి ప్రయత్నించారు. వెంటనే ఆ తండ్రి ఒక ఆయుధాన్ని తీసుకుని వచ్చాడు..ఆ తల్లి హడావుడిగా ఎవరికో కాల్ చేయడానికి తన మొబైల్ ఫోన్‌ను తీసింది. ఇంతలో ఆ బాలుడు సులభంగా రెయిలింగ్ నుండి బయటికి వచ్చేసి జాలిగా పరిగెత్తాడు..ఇది చూసి తల్లిదండ్రులు నోరెళ్లబెట్టారు. అని మీరు అనుకోవచ్చు..కానీ, ఇది నిజంగా జరిగిందా..? అనే సందేహం కూడా కలుగుతుంది..
ఈ వీడియో రీల్ కోసం చేసింది. ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు. కానీ ఈ వీడియో స్క్రిప్ట్ చేయబడిందని తెలుస్తుంది కదా.! ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికొస్తే, ఈ వీడియో చాలా మందికి నచ్చవచ్చు, కానీ సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన పిల్లలు తర్వాత వారు కూడా ఇలాంటివి అనుసరించే ప్రమాదం ఉంది.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతా svthalasserycouple ద్వారా షేర్ చేశారు. ఈ వీడియో క్యాప్షన్‌లో “ఓ మై గాడ్” అని రాశారు. చాలా మంది వినియోగదారులు వీడియోకు ప్రతిస్పందించారు. ఈ వీడియో కలవరపెడుతోంది. పిల్లలు ఈ వీడియో చూసి కాపీ చేస్తే పరిస్థితి సీరియస్‌గా మారుతుంది. ఇన్‌స్టాగ్రామ్ అలాంటి వీడియోలను నిషేధించాలి.. అని ఒక వినియోగదారు రాశారు. ఇది నిజం కాదు, స్క్రిప్ట్ అని మరొక వినియోగదారు రాశారు. పిల్లవాడు తన తల్లిదండ్రులను బురిడీ కొట్టించాడని అంటున్నారు. కొందరికి ఈ వీడియో నచ్చకపోగా మరికొంతమంది ఈ వీడియోని బాగా లైక్ చేసారు. కొందరు స్మైల్ ఎమోజీతో స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..