వార్నీ.. ఇదేం ఇల్లురా సామీ.. లెహంగా కోసం పెళ్లికూతురి కుటుంబం చేసిన రచ్చ రంబోలే..!

అంతేకాదు.. అక్కడ పరిస్థితి హింసాత్మకంగా మారింది. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన ఫిబ్రవరి 23, 2025న అమృత్సర్ నుండి ఒక వరుడు తన వివాహ బృందంతో పానిపట్ చేరుకున్న కొద్ది సేపటికే పెళ్లి పేటాకులైంది. వరుడి కుటుంబం తెచ్చిన లెహంగాను వధువు కుటుంబం అంగీకరించకపోవడంతో, చాందిని చౌక్ నుండి రూ.40,000 విలువైన లెహంగా తీసుకురావాలని పట్టుబట్టడంతో గొడవ మొదలైంది.

వార్నీ.. ఇదేం ఇల్లురా సామీ.. లెహంగా కోసం పెళ్లికూతురి కుటుంబం చేసిన రచ్చ రంబోలే..!
Bride Lehenga

Updated on: Mar 12, 2025 | 1:09 PM

సోషల్‌ మీడియాలో ప్రతి రోజూ అనేక వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వాటిలో పెళ్లికి సంబంధించిన వీడియోలు కూడా అనేకం ఉన్నాయి. కొన్ని పెళ్లిళ్లు హద్దులు మించిన సంతోషంగా సాగిపోతుంటాయి. మరికొన్ని పెళ్లిళ్లు అనుక్షణం టెన్షన్‌, ఉత్కంఠగా సాగుతుంటాయి. ఇంకొన్ని వివాహ వేడుకల్లో ఆహార ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడం వల్ల పీటలదాకా వచ్చిన పెళ్లి ఆగిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అలాగే, పెళ్లి రోజున వరుడు తాగి రావడం వల్ల వివాహాలు రద్దు చేసుకోవడం మనం చూశాము. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

గతంలో పెద్దలు కుదిర్చిన వివాహాలు వేద పండితులు, వేద మంత్రాలు, పెద్దల సమక్షంలో జరిగేవి. అన్ని ఆచారాలు, భయం, భక్తితో, వధూవరులు వారికి కొంచెం ఎక్కువగా అనిపించినప్పటికీ, వివాహ వేడుకగా సరళంగా వివాహం చేసుకునేవారు. కానీ ఇప్పుడు వివాహ వేడుకలు తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, వధువు లేదా వరుడి తరపు వారు వివాహాన్ని రద్దు చేసుకుని వివాహ మండపం నుండి బయటకు వెళ్తున్నారు. చిన్న చిన్న కారణాలకే పెళ్లిని రద్దు చేసుకుంటున్నారు. ఏ మాత్రం వెనుకా ముందు ఆలోచించకుండా పెళ్లి వేడుక ప్రారంభం కాకముందే వధూవరులు పెళ్లి వేడుక నుండి వెళ్లిపోతున్నారు. ఇక్కడ కూడా సరిగ్గా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. వరుడి తరపు వారు తెచ్చిన లెహంగా వధువుకు నచ్చలేదు..దాంతో ఏం చేసిందంటే..

పానిపట్‌లో జరిగిన ఒక వివాహంలో వరుడు తన వధువు కోసం నచ్చిన లెహంగాను తీసుకురాలేదని కారణంగా వివాహం రద్దైంది. ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. వధువు కుటుంబం వరుడి కుటుంబం పరస్పరం వాదించుకోవడంతో గందరగోళం నెలకొంది. వరుడి తరపు వారు తెచ్చిన లెహంగాను వధువు కుటుంబం నచ్చలేదంటూ వ్యతిరేకించింది. ఇది చినికి చినికి గాలి వానగా మారింది. పెద్ద గొడవకు దారితీసింది. చివరకు పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్నారు. అంతేకాదు.. అక్కడ పరిస్థితి హింసాత్మకంగా మారింది. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన ఫిబ్రవరి 23, 2025న అమృత్సర్ నుండి ఒక వరుడు తన వివాహ బృందంతో పానిపట్ చేరుకున్న కొద్ది సేపటికే పెళ్లి పేటాకులైంది. వరుడి కుటుంబం తెచ్చిన లెహంగాను వధువు కుటుంబం అంగీకరించకపోవడంతో, చాందిని చౌక్ నుండి రూ.40,000 విలువైన లెహంగా తీసుకురావాలని పట్టుబట్టడంతో గొడవ మొదలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..