సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియోలు కనిపిస్తాయో ఎవరూ చెప్పలేం. జంతువులు, పాములు, పక్షులకు సంబంధించిన అనేక వీడియోలు కనిపిస్తాయి. వాటి వేట, జీవన విధానం ఎలా ఉంటుందో కనిపిస్తుంది. కొన్ని సార్లు విచిత్రమైన వీడియోలు కనిపిస్తే, కొన్ని సార్లు ఫన్నీ ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వీడియోలు ప్రజలను ఆలోచింపజేస్తాయి. వాస్తవానికి, సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ వందలు, వేల వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇది ఇంటర్‌నెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అలాంటి ఒక వీడియోనే ఇది కూడా. డ్రోన్‌ల గురించి తెలియని గ్రామీణ మహిళలు..తొలిసారిగా డ్రోన్ చూసినప్పుడు ఏం చేశారో ఈ వీడియోలో కనిపించింది. ప్రస్తతుం ఈ వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో ఇద్దరు గ్రామీణ మహిళలు బాటవెంట కాలినడకన వెళ్తున్నారు. అంతలోనే ఇద్దరు ఆకాశం వైపు చూశారు. అక్కడ వారికి ఎగురుతున్న డ్రోన్ కనిపించింది. ముందుగా డ్రోన్ చూసిన ఆ ఇద్దరు మహిళలు అక్కడే ఆగిపోయి దాన్ని స్పష్టంగా చూసే ప్రయత్నం చేశారు. కానీ, ఆ డ్రోన్ వారికి దగ్గరగా రావటంతో ఒక్కసారిగా భయపడిపోయారు. అదేదో వింత ఆకారం తమను వెంబడిస్తుందని భయంతో పరుగులు తీశారు. పాపం వారికి డ్రోన్ టెక్నాలజీ గురించి తెలియదు. అందుకే తొలిసారి డ్రోన్ చూసిన ఆ మహిళలు ఇలా కంగారుపడిపోయారు. ఈ వీడియో ఎక్కడిది అనే దాని గురించి ఎటువంటి సమాచారం లేదు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. ఆ వీడియోపై జనాల నుంచి విశేష స్పందన వస్తోంది. వీరు అమాయకులు, వారిని ఇలా ఎప్పుడూ ఆటపట్టించరాదని ఒక వినియోగదారు రాశారు. మరో వినియోగదారు స్పందిస్తూ.. ఇలా చేయడం వల్ల మీకేం వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోపై పలువురు సంబంధిత యువకుడిని ట్రోల్ చేస్తూ కామెంట్స్ రాస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..