
నేటి సోషల్ మీడియా యుగంలో ఏది ఎప్పుడూ వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు వింత ఫ్యాషన్ ట్రెండ్ ఇంటర్‌నెట్ చర్చనీయాంశంగా మారుతుంది. కొన్నిసార్లు కొందరు వ్యక్తులు చేసే ట్రిక్స్ ప్రజలను ఆశ్చర్యపరుస్తుంటాయి.. ఈసారి, ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్న వీడియో అదేదో బ్రాండెడ్ లేదా ఫ్యాషన్ షో నుండి వచ్చింది కాదు. కానీ, ఇది వినోదభరితమైన, ఆశ్చర్యకరమైన ఒక ప్రత్యేకమైన పానీ పూరి జాకెట్. ఈ వైరల్ వీడియో మిమ్మల్ని కూడా నవ్విస్తుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..
ఈ వైరల్ వీడియోను nitesh.experiment అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వీడియోలోని వ్యక్తి జైపూర్‌లోని ప్రసిద్ధ హవా మహల్ బయట నిలబడి ఉన్నాడు. కానీ, అతని జాకెట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది సాధారణ జాకెట్ కాదు. జాకెట్ ఒక వైపు గోల్గప్పాలతో అలంకరించబడి ఉంటుంది, మరోవైపు కారంగా ఉండే పుదీనా వాటర్ ఉంటుంది. మొత్తం పానీపురి స్టాల్ అతని శరీరంపై ధరించినట్లుగా ఉంటుంది. విశేషమైన విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి తన ప్రత్యేకమైన జాకెట్‌ను ప్రజలకు ప్రదర్శిస్తూ తిరుగుతున్నాడు. చూసిన ప్రతి ఒక్కరూ అతన్ని వీడియోలు తీయడంలో మొదలుపెట్టారు. వైరల్ వీడియోలో పానీ పూరి డ్రెస్ వేసుకున్న ఆ వ్యక్తిని చూసిన జనాలు నవ్వుతూ.. దాన్ని తినాలా లేక వేసుకోవాలా అని అడుగుతారు.
వీడియో ఇక్కడ చూడండి..
పానీ పూరి జాకెట్ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. యూజర్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఒకరు బ్రదర్ ఈ సారి ఫ్యాషన్ వీక్‌లో నడవాలని రాశారు. మరొకరు ఇది స్ట్రీట్ ఫుడ్, ఫ్యాషన్ పరిపూర్ణ కలయిక అంటూ వ్యాఖ్యానించారు. చాలామంది దీనిని ఒక అద్భుతమైన ఆలోచన అంటూ పిలుస్తున్నారు. దీనిని కొంచెం ప్రొఫెషనల్‌గా డిజైన్ చేస్తే, చిన్న వీధి వ్యాపారులకు ఇది గేమ్ ఛేంజర్‌గా నిరూపించబడుతుందంటూ మరొకరు అన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..