Viral Video: నా జోలికి వస్తే అంతే సంగతులు.. కుంగ్ ఫూ స్టంట్స్ చేసిన పాండా.. వీడియో వైరల్

|

Mar 26, 2022 | 2:40 PM

Panda Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా

Viral Video: నా జోలికి వస్తే అంతే సంగతులు.. కుంగ్ ఫూ స్టంట్స్ చేసిన పాండా.. వీడియో వైరల్
Panda
Follow us on

Panda Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజగా.. ఓ పాండా వీడియో తెగ వైరల్ అవుతోంది. అది ఒక్కటే సరదాగా ఆటలాడుతూ కనిపిస్తుంది. అయితే.. మీరు పాండాను చూసే ఉంటారు. ఇది ఎలుగుబంటి పోలి ఉంటుంది. కానీ రంగులో ఎలుగుబంట్ల కంటే చాలా భిన్నంగా అందమైనవిగా ఉంటాయి. భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లలో ఎరుపు రంగు పాండాలు కూడా ఉన్నాయి. పాండా గురించి చెప్పాలంటే.. ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి పాండాలు సోమరి జంతువులు.. ఇవి ఎక్కువ సమయం నిద్రించడానికి, తినడానికి గడుపుతాయి. వాటి ఆహారంలో 99 శాతం వెదురు ఉంటుంది. పాండాకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇవి చాలా ఫన్నీగా ఉంటాయి. అలాంటి ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఒక పాండా వెదురు కర్రతో ఆటలాడుతూ.. రకరకాల విన్యాసాలు చేస్తూ కనిపించింది.

వీడియోలో పాండా సన్నటి వెదురు కర్రను పట్టుకొని దానితో ఆడుకుంటూ కనిపిస్తుంది. కొన్నిసార్లు కిందపడుతూ.. లేస్తూ స్టంట్‌ చేస్తూ కనిపిస్తుంది. అయితే.. పాండా పైకి దూకడం లాంటి ఫీట్ చేద్దామనుకొని కిందపడుతుంటుంది. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘కుంగ్ ఫూ పాండా’, ‘జాక్ బ్లాక్’ అంటూ అభివర్ణిస్తున్నారు.

వైరల్ వీడియో..

ఈ ఫన్నీ వీడియోను @ViralPosts5 అనే యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ 18 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 6 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది లైక్ చేశారు. అదే సమయంలో వీడియో చూసిన తర్వాత నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: తగ్గేదే లే అంటూ కొట్లాడిన పాములు.. చూస్తే వెన్నులో వణుకుపుట్టాల్సిందే..

Viral Video: పిడుగులాంటి చిన్నోడు.. పామును భయంతో పరుగులు పెట్టించాడు