Optical Illusion: మనం ప్రపంచాన్ని చూసే దృక్కోణంపైనే మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం. మన వ్యక్తిత్వం ఎలాంటిది అని చెప్పొచ్చని మానసిక నిపుణులు చెబుతుంటారు. అయితే దీంట్లో శాస్త్రీయత ఉందా అంటే కచ్చితంగా ఉందని చెబుతున్నారు సైకియాట్రిస్ట్‌లు. అందుకే తమ వద్దకు వచ్చే వారి మానసిక స్థితి అంచనా వేయడానికి ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలను ఆధారంగా చేసుకొని, వ్యక్తుల ఆలోచనలను అంచనా వేస్తుంటారు. మొన్నటి వరకు ఈ సబ్జెక్ట్ ఒక రహస్యం. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో. ఈ విషయాలను ఆన్‌లైన్ వేదికగా పంచుకుంటోన్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో సామాన్య ప్రజల్లోనూ ఈ సబ్జెక్ట్‌పై అవగాహన వస్తుంది.
ఇక నెట్టింట వైరల్ అవుతోన్న ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు కోకొల్లలు. తాజాగా ఇలాంటి ఫొటోనే ఒకటి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పైన ఉన్న ఫొటోలో చెట్టు, చెట్టు కింద పులి కనిపిస్తోంది కదూ! అయితే జాగ్రత్తగా గమనిస్తే చెట్టులోని పులి ఆకారం కనిపిస్తుంది. మరి ఈ ఫొటో చూడగానే మీకు ముందుగా ఏం కనిపించింది. దానిబట్టి మీరు ఎలాంటి వారో అంచనా వేయొచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ ఈ ఫోటో చూడగానే మీకు మొదట చెట్టు కనిపిస్తే.. మీరు మీ జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారని, మీ లైఫ్‌పై మీకు ఎలాంటి ఫిర్యాదులు లేవని అర్థం.
మంచి నిర్ణయాలు తీసుకుంటూ మీ జీవతాన్ని సంపూర్ణంగా జీవిస్తున్నారని అర్థం. ఒకవేళ చెట్టుతోపాటు కింద ఉన్న పులి కూడా కనిపిస్తే..మీ చుట్టూ జరుగుతోన్న ప్రతీ అంశం గురించి జాగ్రత్తగా ఉంటారని అర్థం. ధైర్యం, తెలివితో జీవిస్తుంటారు. అలా కాకుండా మీకు కేవలం చెట్టులోని పులి మాత్రమే కనిపిస్తే మాత్రం మీరు ఏదో బాధతో, తెలియని ఆవేదన, భయంతో ఉన్నారని అర్థం.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..
Also Read: Anasuya Bharadwaj:డిఫరెంట్ హెయిర్ స్టైల్ లో జబర్దస్త్ భామ.. బ్యూటీ అందాలకు ఫిదా అవ్వాల్సిందే