Optical Illusion: ఈ ఫోటోలో ముందుగా ఏం కనిపిస్తోంది.. దాని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పొచ్చు..

Optical Illusion: సోషల్‌ మీడియా పుణ్యామాని వింతలు విశేషాలు వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకు కాలక్షేపం కోసం ఎన్నో రకాల పజిల్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ట్రెండ్ నడుస్తోంది. సాధారణంగా మానసిక నిపుణులు ఫోటోల ఆధారంగా వ్యక్తుల...

Optical Illusion: ఈ ఫోటోలో ముందుగా ఏం కనిపిస్తోంది.. దాని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పొచ్చు..

Updated on: Apr 29, 2022 | 6:27 PM

Optical Illusion: సోషల్‌ మీడియా పుణ్యామాని వింతలు విశేషాలు వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకు కాలక్షేపం కోసం ఎన్నో రకాల పజిల్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ట్రెండ్ నడుస్తోంది. సాధారణంగా మానసిక నిపుణులు ఫోటోల ఆధారంగా వ్యక్తుల మానసిక స్థితిని అంచనా వేస్తుంటారు. మనం చూసే ధృక్కోణం ఆధారంగా మనం ఎలాంటి వాళ్లం, ఎలా ఆలోచిస్తాం అన్న విషయాలు చెబుతుంటారు.

ఒకప్పుడు ఎవరికీ పెద్దగా తెలియని ఈ విషయాలు, ఇప్పుడు సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఇలాంటి ఓ ఆప్టికల్‌ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పైన ఉన్న ఫోటోను తీక్షణంగా గమనిస్తే కప్పతో పాటు, ఏనుగు తల కూడా కనిపిస్తోంది కదూ! అయితే మొదట ఫొటో చూడగానే ఏం కనిపించిందన్న దాని బట్టి మీరు ఎలాంటి వారో అర్థం చేసుకోవచ్చు.

ఒకవేళ ఈ ఫొటో చూడగానే ముందుగా మీకు గుర్రం కనిపిస్తే మీరు ధృడ సంకల్పం ఉన్న వ్యక్తులని అర్థం. జీవితంలో ఎదురయ్యే ప్రతీ కష్టాన్నీ అధిగమించగలరు. ఒకవేళ మీకు ముందుగా కప్ప కనిపిస్తే.. ఈజిప్ట్ పురాతన సంస్కృతిలో కప్ప అనేది సంతానోత్పత్తికి, నీరు, పునర్జీవనానికి చిహ్నాలు. మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా అందరితో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. మీరు ఇచ్చే సలహాలను, అభిప్రాయాలను చాలా మంది విశ్వసిస్తారు. మైండ్స్‌ జర్నల్‌లో ఈ విషయాలు వెల్లడించారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Also Read: Indian Railway: అర్థాంతరంగా రద్దవుతున్నాయి.. ఆలస్యంగా గమ్య స్థానాలకు చేరుతున్నాయి.. రైల్వే తీరుతో ప్రయాణికులు సతమతం

Bjp vs Trs: ప్రభుత్వ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమా?.. బీజేపీ నేతలపై ఫైర్ అయిన మంత్రి ప్రశాంత్ రెడ్డి..

Nikhil: మీకు కొడుకుగా ఉన్నందుకు ప్రతిక్షణం గర్వపడ్డాను.. తండ్రి మరణంపై హీరో నిఖిల్ భావోద్వేగ లేఖ..