Photo Puzzle: కనిపెట్టండి చూద్దాం.. ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫజిల్‌ చిత్రాలు తరచూ జనాలను ఆకర్షిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవి ఎప్పటికప్పుడూ జనాల తెలివితేటలను సవాల్‌ చేస్తూ ఉంటాయి. అందుకే జనాలు కూడా వాటిని సాల్వ్ చేసేందుకు ఇష్టపడుతారు. తాజాగా అలాంటి ఒక చిత్రంలో వైరల్‌ అవుతుంది. మీకు కూడా ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేసే అలవాటు ఉంటే ఇప్పుడే ట్రై చేయండి.

Photo Puzzle: కనిపెట్టండి చూద్దాం.. ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
Optical Illusion (2)

Updated on: Dec 26, 2025 | 12:51 PM

ప్రతి రోజూ సోషల్‌ మీడియిలో అనేక రకాల, వీడియోలు, చిత్రాలు వైరల్‌ అవుతూ ఉంటాయి. వీటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కూడా ఒకటి. ఈ గమ్మతైన చిత్రాలు జనాలను బలే ఆకట్టుకుంటాయి. ఎందుకంటే ఇవి మన తెలివితేటలను సవాల్ చేస్తాయి. అందుకే సమయం దొరికినప్పుడల్లా చాలా మంది వీటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. వీటిని పరిష్కరించడం ద్వారా మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను మనం ఈజీగా ఎదుర్కోవచ్చు. ఏటైంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏవైన సమస్యలు వచ్చినప్పుడు ఎలా ముందడుగు వేయాలో ఇవి మనకు నేర్పిస్తాయి.

అయితే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సాల్వ్ చేయడం అంత సులభమైన పనేంకాదు. కేవలం తెలివైన వారు మాత్రమే వీటిని పరిష్కరించగలరు. గతంలో మీరు ఇలాంటి ఫజిల్స్‌ను పరిష్కరించినా, లేదా అందులో విఫలమైనా ఏం పర్లేదు.. ఇప్పుడు మీ తెలివితేటలను పరీక్షించుకునేందుకు మరో ఛాన్స్ దొరికింది. తాజాగా వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని మీరు 30 సెకన్లలో గుర్తిస్తే.. మీ తెలివితేటలు పెరిగినట్టే. మరీ ఈ పజిల్‌ను పరిష్కరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

 

ఈ చిత్రంలో ఏముంది..

వైరల్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం మిమ్మల్ని మొదటి చూపులో గందరగోళానికి గురిచేయవచ్చు. ఎందుకంటే అందులో మీకు కొన్ని గొర్రెలు ఒక స్థలంలో కూర్చొని, నిల్చొని ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ వాటి మధ్యలో ఒక పుట్టగొడుగు కూడా ఉంది. ఇక్కడ మీ టాస్క్‌ అదే.. ఈ చిత్రంలో దాగి ఉన్న పుట్టగొడుగును 30 సెకన్లలో గుర్తించాలి

మీరు పుట్టగొడుగు చూశారా?

మీకు ఇచ్చిన నిర్ణిత కాల వ్యవధిలో మీరు చిత్రంలో దాగి ఉన్న పుట్టగొడుగుని కనిపెట్టారా? అయితే మీకు ధన్యవాదాలు.. ఒక వేళ మీరు దాన్ని కనిపెట్టలేకపోయినా.. ఏం పర్లేదు. దాని సమాధానం మేం చెబుతాం. మీరు చిత్రం మధ్యలో కూర్చొని ఉన్న గొర్రెను చూస్తే అక్కడ పుట్టగొడుకు రౌంట్ సర్కిల్‌తో మార్క్ చేయబడి కనిపిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.