Optical Illusions: వందేళ్ల క్రితం నాటి ఫోటో.. పక్షిలో దాగున్న చేపలు పట్టే వ్యక్తిని 11 సెకన్లలో గుర్తిస్తే.. మీరు జీనియస్

ఈ ఆప్టికల్ ఇల్యూషన్ డ్రాయింగ్‌ను నిశితంగా పరిశీలించి.. స్కెచ్‌లో చేపను పట్టుకుంటున్న వ్యక్తిని గుర్తించడానికి ప్రయత్నించండి. మనిషి , చేపల ముఖాన్ని కనుగొనడం చాలా గమ్మత్తైనదిగా కనిపించవచ్చు

Optical Illusions: వందేళ్ల క్రితం నాటి ఫోటో..  పక్షిలో దాగున్న చేపలు పట్టే వ్యక్తిని 11 సెకన్లలో గుర్తిస్తే.. మీరు జీనియస్
Optical Illusion

Updated on: Sep 09, 2022 | 7:07 PM

Optical Illusions: ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం మెదడుకు పదును పెడుతుంది. అంతేకాదు చిత్రంలో దాగున్న వస్తువులు, వ్యక్తును గుర్తించే సవాల్ ను ఇచ్చే మనోహరమైన చిత్రం. భౌతిక, శారీరక , అభిజ్ఞా భ్రమలు వంటి అనేక రకాల ఆప్టికల్ భ్రమలు ఉన్నాయి. ఒక సాధారణ మనిషి మెదడు ప్రతి కోణం నుండి విభిన్నమైన అవగాహనను ఏర్పరుచుకుంటూ అనేక విషయాలను లేదా చిత్రాలను విభిన్నంగా చూడవచ్చు. కనుక ఆప్టికల్ భ్రమలు కూడా మానసిక విశ్లేషణ రంగంలో ఒక భాగం. ఎందుకంటే మీరు విషయాలను ఎలా గ్రహిస్తారనే దానిపై కొంత అవగాహన కలిగిస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న  చిత్రం లో ఓ పెద్ద పక్షి ఉంది.. అందులో ఒక మనిషి దాగుంది.

వైరల్ అవుతున్న ఫొటో వాస్తవంగా 1904లో న్యూయార్క్ హెరాల్డ్‌లో ప్రచురించబడింది. ఆప్టికల్ భ్రమలో “కొంగ ఒక చిన్న గడ్డి ఉన్న ప్రదేశానికి చేరుకుంది. అక్కడ కొంగ చేప నోటితో కరుచుకుంది. “ఈ చిత్రంలో ఒక గమ్మత్తైన పజిల్ దాగుంది. ఈ ఆప్టికల్ భ్రమలో  దాగి ఉన్న ఒక పెద్ద పక్షి స్కెచ్ లోపల చేపలను పట్టుకుంటున్న వ్యక్తిని గుర్తించాలి.

Optical Illusion

అధిక IQ ఉన్న వ్యక్తులు 11 సెకన్లలో భారీ పాక్షిలో దాగున్న చేపలు పట్టుకుంటున్న వ్యక్తిని గుర్తించగలరు

ఇవి కూడా చదవండి

ఈ ఆప్టికల్ ఇల్యూషన్ డ్రాయింగ్‌ను నిశితంగా పరిశీలించి.. స్కెచ్‌లో చేపను పట్టుకుంటున్న వ్యక్తిని గుర్తించడానికి ప్రయత్నించండి. మనిషి , చేపల ముఖాన్ని కనుగొనడం చాలా గమ్మత్తైనదిగా కనిపించవచ్చు.  కానీ మీరు చిత్రాన్ని తలక్రిందులుగా తిప్పితే గుర్తించడం ఈజీ. పైభాగంలో ఉన్న చిత్రం ఒక పెద్ద పక్షి తన ముక్కులో మనిషిని పట్టుకున్నట్లు చూపిస్తుంది.

Optical Illusion

అయితే, డ్రాయింగ్‌ను తిప్పండి. అప్పుడు పడవలో ఉన్న ఒక వ్యక్తి చేపను గమనిస్తున్న చిత్రం కనిపిస్తుంది. మీరు చిత్రాన్ని తలక్రిందులుగా చూసినప్పుడు  పక్షి తల ఒక క్షణం క్రితం మనం వెతుకుతున్న పెద్ద చేపగా మారుతుంది. పక్షి శరీరం ఒక ద్వీపంగా మారుతుంది.. కాళ్ళు చెట్లుగా మారుతాయి.  మీరు కేవలం 11 సెకన్లలో భారీ పక్షి చిత్రంలో దాగున్న చేపలు పట్టే వ్యక్తిని గుర్తించగలిగితే, అది మీ అసాధారణ తెలివితేటలు లేదా అధిక IQ స్థాయికి సంకేతం కావచ్చు. కష్టమైన పజిల్స్‌తో మీ మెదడుకు ఎంత వ్యాయామం చేస్తే అంత తెలివిగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..