Optical Illusion: సోషల్ మీడియా ఫన్నీ విషయాలు మాత్రమే.. మెదడుకు పదును పెట్టె అనేక విషయాలు కూడా షేర్ అవుతూ సందడి చేస్తున్నాయి. కొన్నిసార్లు కొన్ని చిత్రాలను చూడనే ఈ చిత్రంలో ఏముంది అని ఆలోచిస్తాం. కొన్నింటిని ఎవరైనా చూడగానే వెంటనే కనెక్ట్ అవుతారు. పరిష్కారం కనుకోమంటూ కొన్ని ఫజిల్స్ తో కూడిన ఫోటోలు నెటిజన్లకు సవాల్ విసురుతూ ఉంటాయి. వీటిని పరిష్కరించడాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటారు. కొంతమంది కొన్నింటిని చిటికెలో పరిష్కరిస్తారు. అయితే మరికొందరు ఎంత కష్టపడినా చిత్రాన్ని అర్థం చేసుకోలేరు.. అందులో దాగున్న సమస్యను పరిష్కరించలేరు. అటువంటి చిత్రాలను ఆప్టికల్ ఇల్యూషన్స్ అని పిలుస్తారు. అంటే కళ్లకు భ్రమను కల్పిస్తాయి. చిత్రంలో ఏందో ఉంటాయి.. అయితే చూపరులకు అందులో మరేదో కనిపిస్తుంది. ఇప్పుడుసోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో కూడా అటువంటిదే.. ఈ చిత్రంలో ఒక ప్రముఖుడి ముఖం నల్ల చుక్కల మధ్య దాగి ఉంది.. అయితే అతను ఎవరో గుర్తించలేకపోయారు.
చుక్కల్లో దాగి ఉన్న పాప్ స్టార్ ముఖం
సెలబ్రిటీ ముఖాన్ని గుర్తించడంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎందుకంటే ఈ చిత్రంలో సమస్యను సాల్వ్ చేయాలంటే.. అతికష్టంగా ఉండేలా ఆప్టికల్ భ్రమను సృష్టించాడు ఆర్టిస్ట్. మరి మీరు ఈ చిత్రంలో దాగున్న ఆ ప్రముఖ పాప్ స్టార్ ముఖ్యాన్ని 30 సెకన్లలోపు గుర్తిస్తే.. అతను మేథావి అని చెబుతున్నాడు ఆ కళాకారుడు. మరి మీరు కూడా మేథావి అనిపించుకోవాలంటే.. వెంటనే మీ మెదడుకి పదును పెట్టి.. చిత్రంపై దృష్టి పెట్టండి. చుక్కల వెనుక ఉన్న ప్రముఖుడు పాప్ స్టార్ ను టక్కున గుర్తు పెట్టుకోండి. మీరు ఎంత కష్టపడినా ఫొటోలో దాగున్న సమస్యను సాల్వ్ చేయకపోతే.. టెన్షన్ పడకండి. మేము మీకు ఒక సింపుల్ చిట్కాను ఇస్తున్నాం.. దీంతో వెంటనే చుక్కల్లో దాగున్న పాప్ స్టార్ ముఖాన్ని చుట్టుకున్న గుర్తుపట్టేస్తారు.
ఇప్పటికీ ఫొటోలోని పాప్ స్టార్ ని గుర్తు పెట్టకలేకపోతే.. ఈ ట్రిక్‌ని అనుసరించండి
మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్ కాంతిని తగ్గించండి.. అప్పుడు చుక్కల్లో దాగున్న పాప్ స్టార్ ముఖాన్ని మీరు ఈజీగా గుర్తించవచ్చు. అప్పటికీ కీ గుర్తించడంలో విఫలమైతే.. స్క్రీన్‌ను అడ్డంగా పెట్టి చూడటం సులభమయిన మార్గం. ఆ చుక్కల మధ్య దాగున్న సెలబ్రెటీ, ప్రముఖ పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..