Optical Illusion: ఆప్టికల్ భ్రమ చిత్రాలు మీ కళ్ళు, మెదడుని, తార్కిక నైపుణ్యానికి పరీక్ష. అందుకనే ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రాలను చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసులవారిని ఆకట్టుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే.. చిత్రంలోని విచిత్రాలను కనిపెట్టడానికి ప్రతిఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ పరిశీలన శక్తిని పరీక్షించుకోవడానికి చిత్రంలో సవాల్ ను సాల్వ్ చేయడానికి పోటీపడుతున్నారు. ముఖ్యంగా చిత్రంలో దాగున్న వస్తువులను, జంతువులను కొన్ని సెకన్లలో కనుగొనే చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యూషన్స్ ను మీముందుకు తీసుకొచ్చాము. ఈ చిత్రంలో దాగున్న ముఖాన్ని 15 సెకన్లలోపు కనుకొంటే.. మీ కంటి పవర్, పరిశీలన శక్తి అమోఘం..
ఆప్టికల్ ఇల్యూషన్స్ లో అద్భుతమైన భ్రమతో నిండిపోయింది. చెట్లు, చేమలు రాళ్లతో అడవిని తలపిస్తోంది. అయితే అందులో ఒక అందమైన ముఖం దాగుంది. ఇది నెటిజన్లను గందరగోళానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా మంది ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నారు. అయితే ఈ ప్రత్యేక ఆప్టికల్ భ్రమ ను కనుగొనడం చాలా కష్టం అని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు ఈ ఆప్టికల్ భ్రమకు సమాధానం చెప్పడంలో చాలా మంది విఫలమయ్యారు
మీరు 15 సెకన్లలోపు ఈ చిత్రంలో దాగున్న ముఖం మీరు కనిపెట్టగలరా?
అప్పుడప్పుడు.. కొన్ని చిత్రాలలో కనిపించేది ఏది నిజమో అబద్ధమో అర్ధం కాదు.. ఆ చిత్రంలోని విచిత్రాన్ని అర్థం చేసుకోవాలంటే మనస్సుతో దృష్టి పెట్టాలి. ఇలాంటి చిత్రాలను ఆప్టికల్ భ్రమలు అంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల ఆప్టికల్ ఇల్యూషన్స్ ఉన్న ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రాలు మనస్సు, కళ్ళను చాలా వివరంగా అధ్యయనం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ చిత్రాలను చూసిన ప్రజలు తరచుగా గందరగోళానికి గురవుతారు. ఈ చిత్రాలలో ఉన్న రహస్యానికి పరిష్కారాన్ని గుర్తించడం కష్టం.
క్రింది చిత్రాన్ని పరిశీలించండి. నేలపై చెట్లను.. కొన్ని ఎండిన ఆకులను పరిశీలించండి. ఈ చిత్రంలో ముఖాన్ని గుర్తించగలరా?
చిత్రంలో దాగున్న ముఖాన్ని కనుగొనడం కోసం ఈ సింపుల్ సూచనలు పాటించండి. చిత్రంలోని కుడి వైపున పరిశీలించండి.. మనిషి ముఖం చూడవచ్చు. ఎండిన ఆకుల కుప్ప దగ్గర మనిషి ముఖం దాగి ఉంది. మీరు ఇది చూడగలుగుతున్నారా?
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..