Viral: మటన్ తినాలనుకున్నాడు.. కలలో మేక తలను కోశాడు.. తీరా కళ్లు తెరిచి చూసేసరికి!
మనంలో చాలామంది కలలు కంటుంటారు. నిద్రలో నడుస్తుంటారు, నిద్రలో మాట్లాడుతుంటారు..
మనంలో చాలామంది కలలు కంటుంటారు. నిద్రలో నడుస్తుంటారు, నిద్రలో మాట్లాడుతుంటారు.. ఇంకొందరైతే తమకు నచ్చిన కలలను నిద్రలో ఎంచక్కా కనేస్తుంటారు. సరిగ్గా ఈ కోవలోనే ఓ వ్యక్తి తనకిష్టమైన మటన్ తింటున్నట్లు కల కన్నాడు. ప్రస్తుతం అదే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్.
వివరాల్లోకి వెళ్తే.. ఘనాకు చెందిన కోఫీ అట్టా అనే రైతుకు మటన్ అంటే చచ్చేంత ఇష్టం. ఇంకా చెప్పాలంటే ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఈ క్రమంలోనే తన భార్యను చికెన్ వండాలని చెప్పాడు.. కానీ ఈలోపే నిద్రలోకి జారుకున్నాడు. అయితే ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ వచ్చింది.
కోఫీ అట్టా కలలో మేక తలను కోస్తున్నట్లు అనుకుని.. ఓ కత్తి పుచ్చుకుని ఏకంగా తన పురుషాంగాన్ని కట్ చేసుకున్నాడు. ఇంతలో అతడికి ఠక్కున మెలుకువ వచ్చింది. కళ్లు తెరిచి చూడగానే అసలు విషయం అర్ధమైంది. దీంతో కుటుంబసభ్యులు అతడ్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం సదరు వ్యక్తికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..