Optical Illusion: మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న పిల్లిని 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపులు!

సోషల్‌ మీడియాలో తరచూ చిత్రవిచిత్ర ఫోటోలు, వీడియోలో వైరల్‌ అవుతూ ఉంటాయి. వాటిలో అప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కూడా ఒకటి. ఇవి గమ్మతైన చిత్రాలు జనాలను బలే ఆకర్షిస్తాయి. ఇవి మన కళ్లు, బ్రెయిన్‌కు పనిచెప్పడమే కాకుండా మన తెలివితేటలను కూడా సవాల్‌ చేస్తాయి. అందుకే వీటిని సాల్వ్ చేసేందుకు జనాలు తరచూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. తాజాగా అలాంటి ఒక చిత్రమే ప్రస్తుతం వైరల్‌గా మారింది. అదేంటో చూద్దాం పదండి.

Optical Illusion: మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న పిల్లిని 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపులు!
Optical Illusion

Updated on: Dec 18, 2025 | 8:01 AM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఎప్పటికప్పుడూ జనాలకు కొత్త కొత్త సవాళ్లను విసురుతుంటాయి. ఇవి వారి కళ్లకు పనిచెప్పడంతో పాటు తెలివితేటలను కూడా పెంచుతాయి. అందుకే సమయం దొరికినప్పుడల్లా చాలా మంది వాటని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు కూడా అలాంటి చిత్రాలనే సాల్వ్ చేయాలి అనుకుంటే.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఒక చిత్రం ఇక్కడ ఉంది. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే.. ఈ దట్టమైన అడవిలో దాగి ఉన్న పిల్లిని మీరు కనుగొనాల్సి ఉంటుంది. అది కూడా కేవలం నిర్దిష్ట సమయంలో మాత్రమే.

ఈ చిత్రంలో ఏముంది.

r/FindTheSniper అనే రెడ్డిట్ ఖాతా షేర్ చేయబడి ఈ చిత్రాన్ని మీరు మొదటి చూసినప్పుడు.. అక్కడ కేవలం మీకు అడవి మాత్రమే కనిపిస్తుంది. అక్కడ కొన్ని చెట్ల కొమ్మలు, పచ్చదనంతో నిండిన ప్రశాంతమైన అడవిలా కనిపిస్తుంది. కానీ వాటి మధ్యలోనే ఒక పిల్లి దాక్కుని ఉంది. ఇక్కడ మీ టాస్క్‌ అదే.. ఆ అడవిలో దాగి ఉన్న పిల్లిని మీరు 10 సెకన్లలో కనిపెట్టాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సమాధానం ఇక్కడ ఉంది

ఈ అద్భుతమైన చిత్రంలోని చిక్కును మీరు నిర్ణిత సమయంలో పరిష్కరించినట్లయితే మీకు ధన్యవాదాలు. ఒక వేళ మీరు దాన్ని కనిపెట్టలేక పోతే ఏం పర్లేము మేము మీకో సలహా ఇస్తాము. పిల్లి ఒక చెట్టు కింద, కొంచెం కుడి వైపున దాక్కుంది. పిల్లి శరీరం నేల దగ్గర బెరడు, ఆకులు, నీడలతో దాదాపుగా కలిసిపోతుంది. ఈ క్లూ ఆధారంగా మీరు పిల్లిని గుర్తించగలరని మేము ఆశిస్తున్నాము.

Optical Illusion

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.