Optical illusion: నెటిజన్లను తికమక పెడుతోన్న ఫోటో.. ఈ ఫొటోలో పిల్లి ఉంది కనిపెట్టండి

ఇక నిత్యం పదుల సంఖ్యలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా వైరల్ అవుతోన్న ఫోటోలలో ఈ ఫొటో ఒకటి.

Optical illusion: నెటిజన్లను తికమక పెడుతోన్న ఫోటో.. ఈ ఫొటోలో పిల్లి ఉంది కనిపెట్టండి
Optical Illusion

Edited By:

Updated on: Nov 07, 2022 | 12:33 PM

ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఒత్తిడి తగ్గించుకోవాలన్నా.. మెదడుకు పదును పెట్టాలన్న ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలనే వెతుకుంటున్నారు నెటిజన్లు. దాంతో సోషల్ మీడియాలో ఇలా ఫోటోలకు క్రేజ్ పెరిగింది. ఇక నిత్యం పదుల సంఖ్యలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా వైరల్ అవుతోన్న ఫోటోలలో ఈ ఫొటో ఒకటి. ఈ ఫోటో చూడటానికి సింపుల్ గానే ఉన్న నెటిజన్లను మాత్రం తికమక పెడుతోంది. ఈ ఫొటోలో ఓ జంతువు దాగి ఉంది. దాన్ని కనిపెట్టడం చాలా కష్టమే అంటున్నారు నెటిజన్లు. హింట్ ఇచ్చినా దొరకడం లేదని చేతులెత్తేస్తున్నారు. ఇంతకు ఈ ఫొటోలో దాగి ఉన్న జంతువు ఏంటంటే..

రంగురంగుల బట్టలు , వార్డ్‌రోబ్‌ల మధ్య పిల్లి దాక్కుంది. 15 సెకన్లలోపు సాధ్యం కాకపోతే, మరో పది సెకన్లు తీసుకోండి. అయినా కనిపెట్టడం కష్టంగానే ఉంది. ట్రంక్‌ల పైన ఏదైనా దాగి ఉందో లేదో చూడండి? లేక లోపల చొక్కా? లేదు. కింద బూట్లు ఉన్నాయా? ఇన్ని రంగుల మధ్య నల్ల పిల్లి దొరకడం చాలా కష్టం, కాదా? వార్డ్రోబ్  కుడి వైపున చూడండి. మీరు చివరి గదిలో ఏదైనా చూసారా? మీరు పిల్లిని నేరుగా చూడలేరు. ఇది కొన్ని చిరిగిన గుడ్డ వెనుక దాగి ఉంది. దొరికిందా..

ఇవి కూడా చదవండి

Optical Illusion Pic

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..