
సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత నెట్టింట నిత్యం ఏదో ఒక అంశం వైరల్ అవుతూనే ఉంటుంది. వీటిలో సమాచారం అందించే అంశాలు కొన్ని అయితే, వినోదాన్ని పంచే అంశాలు మరికొన్ని. ఎంటర్‌టైన్‌మెంట్ అందించే వాటిలో ఆప్టికల్ ఇల్యూజన్స్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా మెదడుకు మేతలా కూడా ఆ ఆప్టికల్ ఇల్యూజన్స్ ఉంటాయి. ఇక మరికొన్ని కంటి పవర్‌కు పరీక్ష పెట్టేవి ఉంటాయి. తాజాగా అలాంటి ఓ ఫొటోనే నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
పైన ఉన్న ఫొటో చూడగానే మీకు ఏం కనిపిస్తోంది.? ఏముంది ఏదో దట్టమైన అడవిలో చెట్లు ఉన్నాయి అంటారు కదూ! అయితే ఈ ఫొటోలో ఓ పులి దాగి ఉంది కనిపించించిందా.? చెల్ల మాటున దాగి ఉన్న ఆ పులిని కనిపెట్టడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ముఖ్య ఉద్దేశం. ఎండిన ఆకుల నడుమ అదే రంగులో కలిసి పోయిన పులిని పది సెకండ్లలో కనిపెట్టగలిగితే నిజంగానే మీ కంటి పవర్ అమోహం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ ఇప్పటికైనా పులిని గుర్తించగలిరా.?
ఏంటీ.. ఇంకా పులిని గుర్తించలేకపోయారా.? అయితే ఓసారి ఫొటో మధ్యలో గమనించండి. చెట్టు నీడలో హాయిగా సేద తీరుతోన్న పులి కనిపిస్తుంది. నలుపు, పసుపు రంగుల చారలతో ఉన్న టైగర్ కంటపడుతుంది. ఇన్ని క్లూ్‌స్ ఇచ్చిన కనిపెట్టలేకపోయారా.? అయితే జవాబు కోసం ఓసారి కింద చూడండి.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..