Optical Illusion: మీ కళ్లే మిమ్మల్ని మోసం చేస్తాయ్‌.. ఈ ఫొటోలో హెలికాప్టర్‌ ఉంది, కనిపెట్టే దమ్ముందా.?

ఆప్టికల్ ఇల్యూషన్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అయ్యే సబ్జెక్ట్స్‌లో ప్రధానమైంది. మనిషి మెదడుకు మేత పెట్టే ఫొటోలు నెటిజన్లను తికమక పెడుతుంటాయి. సోషల్‌ మీడియాలో ఛాలెంజ్‌లు విసురుతూ ఈ తరహా ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెట్టింట తెగ సందడి చేస్తోంది. పజిల్‌ను సాల్వ్‌ చేయడంటూ...

Optical Illusion: మీ కళ్లే మిమ్మల్ని మోసం చేస్తాయ్‌.. ఈ ఫొటోలో హెలికాప్టర్‌ ఉంది, కనిపెట్టే దమ్ముందా.?

Updated on: Jan 10, 2023 | 12:00 PM

ఆప్టికల్ ఇల్యూషన్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అయ్యే సబ్జెక్ట్స్‌లో ప్రధానమైంది. మనిషి మెదడుకు మేత పెట్టే ఫొటోలు నెటిజన్లను తికమక పెడుతుంటాయి. సోషల్‌ మీడియాలో ఛాలెంజ్‌లు విసురుతూ ఈ తరహా ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెట్టింట తెగ సందడి చేస్తోంది. పజిల్‌ను సాల్వ్‌ చేయడంటూ  నెటిజన్లకు చాలెంజ్‌ విసురుతోంది.

పైన ఉన్న ఫొటోను చూడగానే ఏం కనిపిస్తోంది. ఏముంది.. కొండ, కొడపైన చిన్న నిర్మాణం ఉంది అని అంటారు కదూ.! అయితే అందులో ఓ హెలికాప్టర్‌ దాగి ఉంది. అదెదో బొమ్మ హెలికాప్టర్‌ కాదండోయ్‌ నిజమైన హెలికాప్టర్‌. గాలిలో చక్కర్లు కొడుతూ ఓ హెలికాప్టర్‌ దూసుకుపోతోంది. ఈ ఫొటోలో ఉన్న ఆ హెలికాప్టర్‌ను కనిపెట్టడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌ ముఖ్య ఉద్దేశం. చాలా వరకు ఆప్టికల్ ఇల్యూజన్స్ గ్రాఫిక్‌తో తయారు చేసినవి ఉంటాయి. అయితే ఈ ఫొటో మాత్రం సహజమైంది కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

ఇంతకీ మీరు హెలికాప్టర్‌ను కనిపెట్టారా లేదా.? అచ్చంగా కొండలపై ఉన్న రాతి కలర్‌లో ఉన్న హెలికాప్టర్‌ ఫొటోలో కనిపించీ కనిపించనట్లు ఉంది. ఓ హెలికాప్టర్‌ అటుగా వెళుతోన్న సమయంలో ఈ ఫొటోను కెమెరాలో బంధించారు. ఏంటీ ఇప్పటికీ కనిపించలేదా.? అయితే ఓసారి ఫొటో మిడిల్‌లో దృష్టిసారించండి. హెలికాప్టర్‌ రెక్కలతో పాటు టైర్స్‌ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంత చెప్పినా కనిపించకపోతే ఆన్సర్‌ కోసం కింద ఫొటో చూడండి.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..