Eye Test: మీ కంటి ఫోకస్ అదుర్స్ అని ఫీలవుతున్నారా..? అయితే ఈ ఫోటోలో పామును కనిపెట్టండి చూద్దాం
ఫోటో పజిల్స్ అనేవి మనకు కాస్త రిలాక్సేషన్‌ను మాత్రమే కాదు. మీ బుర్రను కూడా యాక్టివ్ చేస్తాయి. అందుకే ఇవి ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంటాయి. మీ కోసం కిక్కిచ్చే పజిల్.

పజిల్స్ మీ మైండ్‌ను యాక్టివ్ చేస్తాయి. మీరు మరింత హుషారు అయ్యేందుకు ఉపయోగపడతాయి. ఈ మధ్య కాలంలో ఇన్ స్టా, ఫేస్‌బుక్ పేజిల్లో ఇవి బాగా కనిపిస్తున్నాయి. అయితే ఈ పజిల్స్‌లో కూడా చాలా రకాల వెరైటీస్ ఉంటాయ్. పదాలతో కూడిన పజిల్స్‌ను మీకు తెలుగు భాషపై పట్టు ఉంటే సాల్వ్ చేయొచ్చు. వీటిపై ఓల్డ్ జనరేషన్ వాళ్లు బాగా ఆసక్తి కనబరుస్తారు. ప్రజంట్ యూత్ అంతా.. ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్‌పై తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మీ ఐ ఫోకస్ ఏ మాదిరిగా ఉందో ఈ పజిల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఉన్నా లేనట్లు… లేనిది కూడా ఉన్నట్లు కనిపించడమే ఈ పజిల్స్ ప్రత్యేకత. వీటిని సాల్వ్ చేసే సమయంలో మీ కళ్లు మిమ్మల్నే మోసం చేస్తాయి. కొన్ని అయితే చిక్కు వీడని ప్రశ్నల్లా ఉండి.. బుర్ర హీటెక్కిస్తాయి. అలాంటి ఓ క్రేజీ కిక్కిచ్చే పజిల్‌ను మీ కోసం తీసుకువచ్చాం.
పైన మీరు చూస్తున్న ఫోటో.. ఓ చెట్టుకు సంబంధించినది. కేవలం దాని బెరడు ప్రాంతంపై మాత్రమే ఫోటో గ్రాఫర్ ఫోకస్ పెట్టాడు. అందుకు రీజన్ ఏంటంటే.. అక్కడ ఓ పాము కూడా ఉంది. ఆ చెట్టుపైన ఉంది ఆ డేంజరస్ స్నేక్. ఇంకో విషయం ఏంటంటే.. ? అది ఆ చెట్టు రంగులో కలిసిపోయింది. అందుకే అక్కడ అది ఉన్నట్లు కనిపించదు. బాగా ఫోకస్ పెట్టి చూస్తేనే.. దాన్ని పసిగట్టగలరు. పైపైన చూస్తే మాత్రం.. అది అస్సలు కనిపించదు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ పజిల్ అంతు చూడండి. కనిపెట్టలేకపోతే దిగువన ఇచ్చిన ఆన్సర్ ఉన్న ఫోటో చూడండి.

అందుకే కాస్త పరీక్షగా చూడమని చెప్పింది. ఇప్పుడు అరెరె.. భలే మిస్సయ్యాం అనిపిస్తుంది కదా..! నెక్ట్స్ టైమ్ అయినా కొద్దిగా ఫోకస్ పెట్టి ట్రై చేయండి. మీరు పక్కాగా విజయం సాధిస్తారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
