Eye Test: జంతర్ మంతర్ చూ మంతర్ కాళి.. ఈ ఫోటోలో దాగి ఉన్న కుక్కను నిమిషంలో కనిపెట్టగలరా..?

పజిల్స్ అంటే మీకు ఇష్టమా..? చిక్కు ప్రశ్నలు సాల్వ్ చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగుతారా…? అయితే మీ కోసమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్.

Eye Test: జంతర్ మంతర్ చూ మంతర్ కాళి.. ఈ ఫోటోలో దాగి ఉన్న కుక్కను నిమిషంలో కనిపెట్టగలరా..?
Photo Puzzle

Updated on: Dec 16, 2022 | 5:13 PM

పజిల్స్ మీ బుర్రను షార్ప్ చేస్తాయి.  మీరు మరింత యాక్టివ్ అయ్యేందుక సాయపడతాయి. రీసెంట్ టైమ్స్‌ పజిల్స్ సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్నాయి. అయితే ఈ పజిల్స్‌లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. పదాలతో కూడిన పజిల్స్ కొన్ని అయితే.. మీ ఐ పవర్ టెస్ట్ చేసే పజిల్స్ మరికొన్ని. ఉన్నది లేనట్లు… లేనిది ఉన్నట్లు ఉండటం ఈ పజిల్స్ స్పెషాలిటీ. మీ కళ్లను మోసం చేస్తాయి. కొన్ని అయితే చిక్కు వీడని ప్రశ్నల్లా చికాకు తెప్పిస్తాయి. వీటిని ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అని కూడా అంటారు. ఇవి పిల్లలను మాత్రమే కాదు పెద్దలను కూడా అట్రాక్ట్ చేస్తాయి.  అలాంటి ఓ క్రేజీ ఖతర్నాక్ పజిల్‌ను మీ ముందుకు తీసుకువచ్చాం.

పైన మీరు చూస్తున్న ఫోటోలో పూలు చెట్లు చాలా అందంగా ఉన్నాయి. ఆ పూల చెట్ల మధ్య ఓ డాగ్ ఉంది. పైగా అది మీవైపే చూస్తుంది. మీ పరిశీలనా నైపుణ్యాలు ఎంత బాగున్నాయో మీరు ఈ ఫోటో ద్వారా చెక్ చేయవచ్చు. 1 నిమిషంలోపల మీరు ఆ కుక్కను కనిపెడితే.. మీ కళ్ల ఫోకస్ అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఇంకా లేటయితే మాత్రం మీ దృష్టి సరిగ్గా లేనట్లే. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోతే.. కంగారు పడకండి ఆన్సర్ ఉన్న ఫోటోను మేమే కింద ఇవ్వబోతున్నాం.

 

చూశారా కాస్తంత ఫోకస్‌తో వెతికితే ఆ డాగ్ మీకు కనిపించేదే. హైరానా పడితే ఏ పని అయినా అంతే. ప్రజంట్ ఈ పజిల్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇది మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాం. మరో కిక్కిచ్చే పజిల్‌తో మీ ముందుకు వస్తాం. బై బై.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..