Optical Illusion: మీ ఐ పవర్‌కి ఓ టెస్ట్‌.. ఇందులో ’88’ని కనిపెట్టండి..

|

Nov 09, 2024 | 5:55 PM

ఈ ఫొటోను చూడగానే ఎవరికైనా 89 నెంబర్‌ కనిపిస్తోంది కదూ! అయితే ఇదే ఫొటోలో 88 నెంబర్‌ కూడా ఉంది. ఆ నెంబర్‌ను గుర్తించడమే ఈ ఆప్టికల్‌ ఇల్యూజన్ ఫొటో ముఖ్య ఉద్దేశం. మరెందుకు ఆలస్యం ఈ ఫొటో పజిల్‌ను సాల్వ్‌ చేసి, మీ పవర్‌ ఏ రేంజ్‌లో ఉందో ఓ సారి టెస్ చేసుకోండి...

Optical Illusion: మీ ఐ పవర్‌కి ఓ టెస్ట్‌.. ఇందులో 88ని కనిపెట్టండి..
Optical Illusion Photo
Follow us on

ఆప్టికల్‌ ఇల్యూజన్ ఫొటోలకు ఉండే క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత వీటికి మరింత ఆదరణ పెరిగింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ వీటిని సాల్వ్‌ చేయడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోల్లో ఇమేజ్‌, నెంబర్‌ ఇలా రకరకాలు ఉంటాయనే విషయం తెలిసిందే. ముఖ్యంగా నెంబర్‌కు సంబంధించిన ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫోటోలను సాల్వ్‌ చేయడంలో భలే కిక్కు ఉంటుంది.

తాజాగా ఇలాంటి ఓ నెంబర్‌ ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది. కంటి చూపును పరీక్షించే ఈ ఫొటోకు నెటిజన్లు తెగ లైక్‌ చేస్తున్నారు. ఇంతకీ ఏంటీ ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటో.. అందులో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే 89 నెంబర్‌ కనిపిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఇదే ఫొటోలో 88 నెంబర్ దాగి ఉంది. సదరు నెంబర్‌ను కనిపెట్టడమే ఈ టాస్క్‌ ముఖ్య ఉద్దేశం. అయితే ఈ నెంబర్‌ను 10 సెకండ్లలోపు కనిపెడితే మీ కళ్లు సూపర్ షార్ప్‌ అని అర్థం. మరెందుకు ఆలస్యం ఓసారి ఈ ఫొటోను గమనించి ఆ నెంబర్‌ను గుర్తించండి చూద్దాం.

ఏంటి ఎంత ప్రయత్నించినా ఆ నెంబర్‌ కనిపించడం లేదా.? అయితే ఓసారి ఫొటోను తీక్షణంగా గమనించండి. ఫోటో మధ్యలో ’88’ నెంబర్‌ కనిపిస్తుంది. వరుసగా మొదటి నుంచి నాలుగో వరుసగా జాగ్రత్తగా గమనిస్తే సమాధానం ఇట్టే కనిపిస్తుంది. ఇన్ని క్లూస్‌ ఇచ్చినా నెంబర్‌ను గుర్తించలేకపోతే సమాధానం కోసం కింద ఉన్న ఫొటోను చూడండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..