Optical Illusion: పచ్చని ప్రకృతిలో దాగున్న మోడల్.. చిత్రంలో వయ్యారిభామను క్షణాల్లో గుర్తు పట్టగలరేమో ట్రై చేయండి..

|

Aug 21, 2022 | 10:21 AM

ఆప్టికల్ ఇల్యూషన్‌ అనేది ఒక రకమైన కళ్ల మోసం చేసే చిత్రం. ఫోటో అనిపిస్తుంది.. కానీ దానిలో అనేక విషయాలు దాగి ఉంటాయి.  అవి చూసిన వెంటనే కంటికి కనిపించవు. అందుకనే ఆప్టికల్ భ్రమతో కూడిన కొన్ని చిత్రాలోని విచిత్రాలను కనుగొనడంలో 99 శాతం మంది  విఫలమవుతున్నారు

Optical Illusion: పచ్చని ప్రకృతిలో దాగున్న మోడల్.. చిత్రంలో వయ్యారిభామను క్షణాల్లో గుర్తు పట్టగలరేమో ట్రై చేయండి..
Optical Illusion
Follow us on

Optical Illusion: ప్రస్తతం పోటీ ప్రపంచంలో మనుగడ సాగించాలంటే.. మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం కోసం పోషకాహారం, యోగ, వ్యాయామం చేయాల్సి ఉంటే, మానసికంగా సంతోషముగా ఉంటూ.. మేథస్సుకి పదును పెట్టుకోవడం కోసం పజిల్స్ వంటి వాటిని ఆశ్రయించాల్సిందే. వివిధ రకాల పజిల్స్ ను పరిష్కరించడంద్వారా మెదడుకు వ్యాయామం అవుతుంది. కొన్ని లెక్కల చిక్కులు కనిపెట్టమంటే .. మరొకొన్ని ఆప్టికల్ ఇల్యూషన్ వంటి పజిల్స్‌ను పరిష్కరించడం వంటివి ఉంటాయి. అయితే ఆప్టికల్ ఇల్యూషన్స్ అని కూడా పిలువబడే ఆప్టికల్ భ్రమలను పరిష్కరించడంలో ప్రజలు చెమటలను కక్కేస్తారు. ఈ రోజు మేము మీ కోసం అటువంటి ఆప్టికల్ ఇల్యూషన్‌ను మీ ముందుకు తీసుకువచ్చాము. ఇది ఖచ్చితంగా మీ ‘మెదడుకి పదును పెడుతుంది.

వాస్తవానికి..  ఆప్టికల్ ఇల్యూషన్‌ అనేది ఒక రకమైన కళ్ల మోసం చేసే చిత్రం. ఫోటో అనిపిస్తుంది.. కానీ దానిలో అనేక విషయాలు దాగి ఉంటాయి.  అవి చూసిన వెంటనే కంటికి కనిపించవు. అందుకనే ఆప్టికల్ భ్రమతో కూడిన కొన్ని చిత్రాలోని విచిత్రాలను కనుగొనడంలో 99 శాతం మంది  విఫలమవుతున్నారు. మేము మీకు అందిస్తున్న ఈ ఆప్టికల్ ఇల్యూషన్ పిక్చర్‌లో దాగిన మోడల్‌ను కనిపెట్టడానికి ట్రై చేయండి.. ఈ చిత్రం ఖచ్చితంగా మనిషి మేధస్సుకు సవాల్ వంటిదే.. ఎందుకంటే మొదటి చూపులోనే  మోడల్ ను కనిపెట్టడం చాలా కష్టం. చిత్రంలో పచ్చని ప్రకృతితో నిండి ఉంది. గోడ, ఇనుప గేటు, చెట్లు, ఆకులు మాత్రమే కనిపిస్తాయి.

Optical Illusion

మీరు మోడల్‌ కనిపించిందా..!
చిత్రంలో మీకు ఒక గోడ కనిపిస్తుంది. దాని మధ్యలో పెద్ద ఇనుప గేటు ఉంది. గోడకు ఇటువైపు, అటువైపు కూడా కొన్ని చెట్లు ఉన్నాయి. ఇందులో ఎక్కడో మోడల్ దాక్కుని కూర్చుంది. అయితే.. ఆ మోడల్ ను వెతకడం అందరికీ అయ్యే పని కాదు. మీరు మోడల్‌ను కనుగొన్నట్లయితే.. మీరు ఖచ్చితంగా మేధావి.  మీరు మోడల్ ను కనిపెట్టలేకపోతే.. మేము చెప్పే సూచనలను పాటిస్తూ.. ముందుకు వెళ్ళండి.. గోడకు అనుకుని ఒక చెట్టు ఉంది.. ఆ చెట్టుని పరిశీలించండి.. కింద ఒక మోడల్ .. రాయంచలా నిల్చుని ఉంది. ఇపుడు చిత్రంలో దాగున్న వయ్యారి భామను కనిపెట్టారు కదా..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..