Child-Cobra Video: నాగుపాముపై కాలు పెట్టిన పిల్లాడు.. బుసలు కొడుతూ పైకి లేచిన కోబ్రా.. ట్రేండింగ్ లో ఉన్న వీడియో..
ఓ తల్లి తన కుమారుడిని పెను ప్రమాదం నుంచి తృటి తప్పించింది. బాలుడిని కాటు వేసేందుకు వచ్చిన ఓ భారీ నాగుపాము నుంచి సెకన్ల వ్యవధిలో రెస్క్యూ చేసింది.
ఓ తల్లి తన కుమారుడిని పెను ప్రమాదం నుంచి తృటి తప్పించింది. బాలుడిని కాటు వేసేందుకు వచ్చిన ఓ భారీ నాగుపాము నుంచి సెకన్ల వ్యవధిలో రెస్క్యూ చేసింది. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.కర్ణాటకలోని మాండ్యలో ఈ సంఘటన జరిగింది. ఓ తల్లి తన కుమారుడిని పాఠశాలకు పంపేందుకు ఇంటి నుంచి బయటకు వస్తుంది. అయితే అప్పటికే ఆ ఇంటి మెట్ల కింద ఒక పెద్ద నాగుపాము పాకుతూ వెళుతూ ఉంటుంది. మెట్ల పైనుంచి దిగుతున్న ఆ బాలుడు బూటు వేసుకున్న కాలును ఆ పాముపై వేశాడు. దీంతో ఆ పాము వెంటనే వెనక్కి వెళ్లింది. బుసలు కొడుతూ పైకిలేచింది. అదే సమయంలో ఊడిన బూటు కోసం దగ్గరకు వస్తున్న బాలుడిని కాటేయబోయింది. ఈ సీన్ చూసిన ఆ తల్లి.. తన కొడుకును వెంటనే పక్కకు లాగుకుని, అక్కడి నుంచి పరుగులు తీసింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

